ఉద్యమమంటే ఏంటో చంద్రబాబుకు చూపిస్తా..

విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు అసలు ఉద్యమమంటే ఏంటో చూపిస్తానంటున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఉత్తరాంధ్ర వాసుల కలలు నెరవేరే సమయంలో మోకాలడ్డుతున్న చంద్రబాబుకు ఉత్తరాంధ్ర దెబ్బ రుచి చూపిస్తామంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు స్పీకర్. ఉత్తరాంధ్ర ఫోరం అధ్వర్యంలో జరిగిన సమావేశం తర్వాత తమ్మినేని సీతారాం శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతానికో అభివృద్ధి పరిమితం కావద్దనే మంచి ఉద్దేశంతో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ […]

ఉద్యమమంటే ఏంటో చంద్రబాబుకు చూపిస్తా..

విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు అసలు ఉద్యమమంటే ఏంటో చూపిస్తానంటున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఉత్తరాంధ్ర వాసుల కలలు నెరవేరే సమయంలో మోకాలడ్డుతున్న చంద్రబాబుకు ఉత్తరాంధ్ర దెబ్బ రుచి చూపిస్తామంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు స్పీకర్. ఉత్తరాంధ్ర ఫోరం అధ్వర్యంలో జరిగిన సమావేశం తర్వాత తమ్మినేని సీతారాం శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతానికో అభివృద్ధి పరిమితం కావద్దనే మంచి ఉద్దేశంతో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ ముందుకొచ్చారని, సీఎం సంకల్పానికి అడ్డుపడుతూ చంద్రబాబు జనాన్ని రెచ్చగడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా అమరావతి ఏరియాలో పొందిన భూముల కోసమే చంద్రబాబు ఆందోళన చేస్తున్నారని సీతారాం అన్నారు. రాజధానిని రాజకీయం చేస్తున్న చంద్రబాబుది ఒక బతుకేనా అంటూ తమ్మినేని ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు.

చంద్రబాబుకు వంతపాడుతున్న ఉత్తరాంధ్ర తెలుగుదేశం నేతలకు ప్రజలే బుద్ది చెబుతారని తమ్మినేని హెచ్చరించారు. విశాఖ రాజధాని ప్రతిపాదనను అడ్డుకుంటే సిక్కోలు నుంచి చిత్తూరు దాకా చంద్రబాబు వెంటపడేలా ఉద్యమం నిర్మిస్తానని ఆయన టీడీపీ అధినేతకు వార్నింగ్ ఇచ్చారు.

Click on your DTH Provider to Add TV9 Telugu