AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పైకి అదొక టమాటో లోడ్ లారీ.. తీరా కంటైనర్ ఓపెన్ చేసి చూడగా

ఛతీస్‌గడ్‌ నుంచి ములుగు జిల్లాకు హైదరాబాద్ మీదుగా ఓ కంటైనర్ లారీ వెళ్తోంది. పైకి చూసి అవన్నీ టమాటో లోడ్ అని అందరూ అనుకున్నారు. తీరా లోపల చెక్ చేసి చూడగా.. దెబ్బకు పోలీసులే షాక్ అయ్యారు. ఇంతకీ అదేంటో ఆ వివరాలు..

Telangana: పైకి అదొక టమాటో లోడ్ లారీ.. తీరా కంటైనర్ ఓపెన్ చేసి చూడగా
Telangana
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: May 30, 2025 | 8:00 PM

Share

పుష్ప సినిమాలోని కొన్ని స్మగ్లింగ్ సీన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. కానీ ఈ స్మగ్లింగ్ సీన్ అంతకు మించి ఎవరూ ఊహించనిది. పోలీసులే షాక్ అయ్యేలా పశువులను అక్రమ రవాణా చేస్తున్న పాపాత్ములు అడ్డంగా బుక్కయ్యారు..కంటైనర్ పైన మొత్తం టమాటా ట్రేలు.. లోపల మూగజీవులను బంధించి కబేళాలకు తరలిస్తున్న ఆ వ్యాపారులు అడ్డంగా బుక్కయ్యారు. ఛతీస్‌గడ్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి పశువులను ములుగు జిల్లా మీదుగా హైదరాబాద్ కబేళాలకు తరలిస్తున్న వ్యాపారులు పాపం పండింది. ఈ ఏడాది ఇప్పటివరకు 256 మూగజీవులకు ములుగు జిల్లా పోలీసులు విముక్తి కల్పించారు.

ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో ప్రత్యేక చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి నిఘా ముమ్మరం చేశారు. అయితే గంజాయి నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక చెక్‌పోస్ట్‌లలో అక్రమంగా తరలిస్తున్న మూగజీవులే ఎక్కువగా పట్టుబడుతున్నాయి. వాటిని అత్యంత దారుణంగా వాహనాల్లో బంధిస్తున్న వ్యాపారులు వాటి ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. తాజాగా TS 05UF 2690 గల వాహనంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠా అడ్డంగా బుక్కయ్యారు.

పశువుల అక్రమ రవాణా కోసం కంటైనర్‌ను ప్రత్యేకంగా మాడిఫైడ్ చేసుకున్న వ్యాపారులు.. పైన అన్నీ టమాటా ట్రేలు పెట్టారు. లోపల మూగజీవులను బంధించి కబేళాలకు తరలిస్తున్నారు. మార్గం మధ్యలో పోలీసులు చెక్ చేసిన ప్రతీచోటా టమాటా ట్రేలు తీసుకెళ్తున్నామని నమ్మిస్తూ వచ్చారు. కానీ ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి చెక్‌పోస్ట్ వద్ద అనుమానం వచ్చిన పోలీసులు వాహనం మొత్తం తనిఖీ చేయడంతో అసలు గుట్టు రట్టయింది. పైన టమాటా ట్రేలు లోపల మూగజీవులను చూసి షాక్ అయ్యారు. వాహనం లోపల 17 గుర్తించారు. వాటికి విముక్తి కల్పించి గోశాలకు తరలించారు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌