AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్‌కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రద్దు చేసినట్టు తెలుస్తోంది.

Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
Meenakshi Natarajan's Nomination Rejected
Anand T
|

Updated on: Jun 09, 2026 | 10:09 PM

Share

మధ్యప్రదేశ్‌ నుండి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన టీపీసీసీ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఈ సాయంత్రం షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం. తెలంగాణలో నమోదైన క్రిమినల్‌ కేసుల వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదన్న కారణంతో, ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు రిటర్నింగ్ అధికారి. తెలంగాణలో క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు, అఫిడవిట్‌లో వెల్లడించలేదని ఈసీకి ఫిర్యాదు చేసింది బీజేపీ. ఆ ఫిర్యాదును పరిశీలించిన రిటర్నింగ్ అధికారి, మీనాక్షి నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు.

అయితే తన నామినేషన్ మీనాక్షి నటరాజన్ స్పందించారు. రాజ్యాంగాన్ని BJP ఖూనీ చేస్తోందని ఆరోపించారు రాజ్యసభ అభ్యర్ధి మీనాక్షి నటరాజన్. SIR పేరుతో దేశవ్యాప్తంగా ఓట్‌ చోరీకి పాల్పడ్డ బీజేపీ నేతలు, ఇప్పుడు రాజ్యసభ సీటును చోరీ చేశారని ఆరోపించారు. తగిన సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దించిందని, విజయం కోసం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసేలా రాజకీయాలు చేశారని మండిపడ్డారు.

ఇదిగా ఉండగా మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీజేపీ కుట్రలో భాగంగానే నామినేషన్‌ తిరస్కరించారని ఆరోపించారు. ఓట్ చోరీ, SIR తర్వాత బీజేపీ ఇప్పుడు సీట్‌ చోరీకి పాల్పడుతోందన్నారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. ఈసీని కలవకుండా కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజన్న రేవంత్‌రెడ్డి, ఈ వ్యవహారంపై న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..
నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు!
నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు!
చికెన్ స్కిన్ తింటే మంచిదేనా..? ఇవిగో పూర్తి వివరాలు..
చికెన్ స్కిన్ తింటే మంచిదేనా..? ఇవిగో పూర్తి వివరాలు..
ఆగస్టులో ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ఆగస్టులో ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ఒకే రీఛార్జ్‌లో అన్నీ.. 15 నెలల హై-స్పీడ్ నెట్‌, 12 OTT యాప్‌లు
ఒకే రీఛార్జ్‌లో అన్నీ.. 15 నెలల హై-స్పీడ్ నెట్‌, 12 OTT యాప్‌లు