AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND A vs SL A: దుమ్మురేపిన తిలక్ సేన.. శ్రీలంకపై ఘనవిజయం! ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?

లంక ఏతో జరిగిన ట్రై సిరీస్ తొలి మ్యాచ్‌లో టీమిండియా ఏ 8 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత సెంచరీ, తిలక్ వర్మ అర్ధ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లు చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, లంక ఛేదనను అడ్డుకున్నారు.

IND A vs SL A: దుమ్మురేపిన తిలక్ సేన.. శ్రీలంకపై ఘనవిజయం! ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
India A Vs Sri Lanka A
SN Pasha
|

Updated on: Jun 10, 2026 | 6:53 AM

Share

దంబుల్లా వేదికగా శ్రీలంక ఏతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏ జట్టు దుమ్మురేపింది. 8 పరుగుల తేడాతో విజయం సాధించి, ఈ ట్రై సిరీస్‌ను విజయంతో ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత ఏ జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఐపీఎల్‌లో దుమ్మురేపే బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ప్రభ్‌సిమ్రన్ సింగ్, యువ సంచలనం వైభవ్ సూర్యవన్షీ తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. కేవలం 16 పరుగులకే టీమిండియా 2 కీలక వికెట్లు కోల్పోయింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 2, వైభవ్ 14 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇక ఆ తర్వాత ప్రియాన్ష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్ ఇన్సింగ్స్‌ను చక్కదిద్దారు. ప్రియాన్ష్ 32 బంతుల్లో 32 రన్స్ చేసి అవుట్ అయ్యాడు.

ఇక మంచిగా సెట్ అయిన రుతురాజ్‌కు కెప్టెన్‌ తిలక్ వర్మ జతకలిశాడు. ఇద్దరూ కలిసి 150కి పైగా పరుగుల భాగస్వామ్యం అందించారు. రుతురాజ్ సెంచరీతో కదంతొక్కగా, తిలక్ 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివర్లో ఆయుష్ బదోని 24, సూర్యాన్ష్ 26 పరుగులు చేశారు. మొత్తంగా టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. లంక బౌలర్లలో చమికా కరుణరత్నే, గరుకా, షాన్ తలో వికెట్ తీసుకున్నారు. మహ్మద్ షిరాజ్ 2 వికెట్లతో రాణించాడు. ఇక 278 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు అద్బుతమైన స్టార్ట్ అందించారు. నిరోషన్ డిక్వెల్లా 47, అవిషక ఫెర్నాండో 45 పరుగులు చేసి రాణించారు.

కానీ ఆ తర్వాత లంక వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ షాన్ 74 పరుగులతో రాణించాడు. మొత్తం 48.5 ఓవర్లలో 269 పరుగులకు శ్రీలంక ఏ జట్టు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్, ఆయుష్ బదోని, విప్రాజ్ నిగమ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అన్షుల్ కంబోజ్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటిన రుతరాజ్ గైక్వాడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. భారత ఏ జట్టు తమ తర్వాత మ్యాచ్ జూన్ 11 గురువారం ఆఫ్ఘనిస్థాన్ ఏ టీమ్‌తో ఆడనుంది.

మ్యాచ్ హైలెట్స్ చూడండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us