AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్

చెన్నూరులో సంచలనం సృష్టించిన ఎస్‌బీఐ అంతర్గత బంగారం చోరీ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది. తొమ్మిది నెలల క్రితం చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు పూర్తిగా రికవరీ చేయగా, ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులకు తిరిగి అందజేసింది. అంతేకాకుండా తొమ్మిది నెలల వడ్డీని కూడా మాఫీ చేయడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ బ్యాంకు వద్ద స్వీట్లు పంచుకున్నారు. 400 మందికి పైగా ప్రభావితమైన ఈ కేసులో బాధితులకు భారీ ఊరట లభించింది..

చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
Chennur SBI Gold Theft Case
Naresh Gollana
| Edited By: |

Updated on: Jun 09, 2026 | 9:05 PM

Share

చెన్నూరు, జూన్‌ 9: మంచిర్యాల జిల్లా చెన్నూరులో సంచలనం సృష్టించిన ఎస్‌బీఐ 2 బ్యాంక్ అంతర్గత బంగారం చోరీ కేసు సుఖాంతమైంది. తొమ్మిది నెలల క్రితం జరిగిన ఈ ఘటనలో చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు పూర్తి స్థాయిలో రికవరీ చేసి ఖాతాదారులకు అందజేశారు. అటు బ్యాంక్ యాజమాన్యం సైతం షరతులతో కూడిన నిబందనలతో తొమ్మిది నెలల వడ్డీని మాఫీ చేసి ఖాతాదారులకు బంగారాన్ని అప్పగించింది. తొమ్మిది నెలల నిరీక్షణకు ఎట్టకేలకు ఫలితం దక్కడం తో బ్యాంకులోనే స్వీట్లు తినిపించుకుని హర్షం వ్యక్తం చేశారు ఖాతదారులు.

తొమ్మిది నెలల క్రితం జరిగిన అంతర్గత బంగారం చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తమ కష్టార్జితంతో కొనుక్కుని ఆర్థిక అవసరాలకు తనాఖా పెట్టిన బంగారం మాయం కావడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దాదాపు 400 మందికి పైగా బాదితుల బంగారం క్యాషియర్ మాయం చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నెల రోజుల వ్యవధిలోనే మాయమైన బంగారాన్ని రికవరీ చేశారు. అయితే బ్యాంకు కొర్రీలు పెట్టడం తో తొమ్మిది నెలలుగా తమ బంగారం కోసం నిరసనలు, ఆందోళనలు , ధర్నాలు చేపట్టారు బాదితులు. అయితే ఈ క్లిష్ట సమయంలో ఎస్‌బీఐ సంస్థ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించింది. ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడుతూ వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా భారీ ఊరటనిచ్చింది.

ఇవి కూడా చదవండి

బాదితులకు చెందాల్సిన బంగారాన్ని తిరిగి ఇస్తూనే తొమ్మిది నెలల వడ్డీని మాఫీ చేసింది. దాదాపు 300 మందికై పైగా బంగారాన్ని బాదితులకు అందజేసింది. చోరీకి గురైన బంగారం సురక్షితంగా తిరిగి లభించడమే కాకుండా బ్యాంక్ యాజమాన్యం వడ్డీని కూడా పూర్తిగా మాఫీ చేయడంతో ఖాతాదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఖాతాదారులు బ్యాంకు వద్ద స్వీట్లు పంపిణీ చేసుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

Follow Us