Mancherial: కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకు.. కదల్లేని స్థితిలో బిక్కుబిక్కుమంటున్న వృద్ధురాలు.. చివరకు

 తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ కుమారుడు అమ్మను ఇంట్లో నుంచి గెంటేశాడు. వృద్ధాప్యంలో ఉన్న అత్తను తల్లిలా ఆదరించాల్సిన కోడలు.. ఆమెను రోడ్డున వదిలేసింది. కాలికి మట్టి అంటకుండా,...

Mancherial: కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకు.. కదల్లేని స్థితిలో బిక్కుబిక్కుమంటున్న వృద్ధురాలు.. చివరకు
Mancherial
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 26, 2022 | 7:15 AM

తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ కుమారుడు అమ్మను ఇంట్లో నుంచి గెంటేశాడు. వృద్ధాప్యంలో ఉన్న అత్తను తల్లిలా ఆదరించాల్సిన కోడలు.. ఆమెను రోడ్డున వదిలేసింది. కాలికి మట్టి అంటకుండా, తిని తినక పెంచి పెద్ద చేసిన కొడుకులు, బిడ్డలు.. కన్నతల్లిని కాటికి పంపే పనిలో ఉన్నారు. ఉన్న ఆస్తిని తమ పేరు మీద రాయించుకుని నడిరోడ్డు మీద తల్లిని విడిచిపెట్టారు కొడుకు, కోడలు. కనీసం కూతుళ్లు కూడా కనికరం లేకుండా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండటం మరింత బాధాకరం. కోడలు కర్కషంగా మారి నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయింది. అడ్డుచెప్పాల్సిన కొడుకు చూసి చూడనట్టుగా ఉండటంతో కన్నతల్లి రోడ్డు మీద అనాథలా పడి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ అవ్వ పేరు రాజమ్మ. మంచిర్యాల జిల్లా మందమర్రి మూడో జోన్‌లో నివాసం ఉంటోంది. ఈమెకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. భర్త కాలం చేసిన తర్వాత తన ఇద్దరు కుమారులకు ఆస్తిని పంచింది. అయితే ఇద్దరు కొడుకులు చెరో నెల ఇంట్లో ఉంచుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. కానీ ఒప్పందం ప్రకారం చిన్న కొడుకు తీసుకెళ్లాల్సి ఉన్న తీసుకెళ్లకపోవడంతో ఎన్ని రోజులు మేం చూసుకోవాలి.. ఒప్పందం ముగిసింది అని పెద్ద కోడలు స్థానిక దొరల బంగ్లా వద్ద రోడ్డుపై వదిలేసి వెళ్లింది అని రాజమ్మ రోదిస్తూ తెలిపింది.

కదల్లేని స్థితిలో ఉన్న వృద్దురాలిని చూసిన స్థానికులు కుటుంబసభ్యులతో మాట్లాడారు. అయినా విషయం కొలిక్కి రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు కొడుకు, కోడలికి కౌన్సిలింగ్‌ ఇచ్చి తిరిగి వారి ఇంటికి చేర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట