CM Mamata Banerjee: బెంగాల్ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. బీజేపీ నేత సువేందు అధికారితో మమతా బెనర్జీ టీ మీటింగ్.. కారణం అదేనట..

బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని, బీజేపీ నేత సువేందు అధికారి తొలిసారి కలిశారు. వీరిద్దరి సమావేశం అందరినీ ఆశ్చర్య పరిచింది.

CM Mamata Banerjee: బెంగాల్ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. బీజేపీ నేత సువేందు అధికారితో మమతా బెనర్జీ టీ మీటింగ్.. కారణం అదేనట..
Suvendu Adhikari Meets CM Mamata Banerjee
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 25, 2022 | 7:25 PM

బెంగాల్ రాజకీయాలు నెమ్మదిగా మారుతున్నాయి. ఎవరు ఊహించని టర్న్ తీసుకుంటున్నాయి. ఉప్పు, నిప్పుగా ఉన్న బెంగాల్ రాజకీయాల్లో స్నేహ బంధాలు చిగురిస్తున్నాయి. తాజాగా బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నేత శుభేందు అధికారితో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సమావేశం జరిగింది. దాదాపు ఏడు నిమిషాల పాటు ఇరువురు నేతల మధ్య భేటీ పరంపర కొనసాగింది. ఈ సమావేశంలో శుభేందు అధికారితో పాటు ఎమ్మెల్యే మనోజ్ తిగ్గ, బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ హాజరయ్యారు. అనంతరం అసెంబ్లీ సెషన్‌లో సువేందుని తన సోదరుడు అని సంబోధిస్తూ మమత మాట్లాడారు. సువేందుని తాను టీ కి ఆహ్వానించానని చెప్పారు. మరోవైపు, దీనిపై సువేందు మాట్లాడుతూ.. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన కలయిక అని వెల్లడించారు. అయితే, తాను టీ తాగలేదని చెప్పడం విశేషం.

ముఖ్యమంత్రిని కలిసి కొద్దిసేపు చర్చించి బయటకు వచ్చారు. 2021లో మూడో తృణమూల్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సమావేశం కావడం ఇదే తొలిసారి. గత ఎన్నికల్లో నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో సీఎం మమతా బెనర్జీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ కలుసుకోలేదు. శుక్రవారం ఊహించని రీతిలో వీరిద్దరూ కలవడం దేశ వ్యాప్తంగా చర్చకు కారణంగా మారింది. శాసనసభలో విపక్షనేతగా ఉన్న సువేందు అధికారి అసెంబ్లీలో ఉన్న సీఎం మమత గదికి వెళ్లారు.

శుక్రవారం అసెంబ్లీలో ‘రాజ్యాంగ దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా నూతన భవన ప్రారంభోత్సవం కూడా జరుగుతోంది. అయితే ఆహ్వాన పత్రికలో ప్రతిపక్ష నేత పేరు లేకపోవడంతో కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆయనను తన ఇంటికి పిలిపించుకున్నారు. అంతకుముందు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రయత్నించినప్పుడు, కొంతమంది కోర్టులను ఆశ్రయించి అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు.

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రేషన్ డీలర్ల కొత్త నియామకంపై అడిగిన ప్రశ్నకు బెనర్జీ బదులిస్తూ, ప్రభుత్వం మూడు నెలల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నదని, అయితే కోర్టు కేసుల పోరాటానికి రాష్ట్ర డబ్బు మొత్తం ఖర్చు చేయాలని అన్నారు.

పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, న్యాయవ్యవస్థను పరిశీలించాలని అభ్యర్థించారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అవకతవకలు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించినందున ప్రభుత్వ , రాష్ట్ర ప్రాయోజిత పాఠశాలల్లో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలు న్యాయ పరిశీలనలో ఉన్నాయని గమనించవచ్చు. ఈ గందరగోళంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ జరుపుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం