AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trains: బెర్త్ కన్ఫామ్ కాలేదా.. డోంట్ వర్రీ.. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రైన్ మ్యాన్..

రైల్వేలు ఎంత రద్దీగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ముఖ్యమైన రూట్లలో ప్రయాణం చేసేందుకు కొన్ని నెలల ముందు నుంచే టికెట్ బుక్ చేసుకోవాలి. ఇక వెయిటింగ్ లిస్ట్ ఉంటే పరిస్థితి అంతే. టికెట్ కన్ఫామ్..

Trains: బెర్త్ కన్ఫామ్ కాలేదా.. డోంట్ వర్రీ.. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రైన్ మ్యాన్..
Train
Ganesh Mudavath
|

Updated on: Nov 26, 2022 | 7:02 AM

Share

రైల్వేలు ఎంత రద్దీగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ముఖ్యమైన రూట్లలో ప్రయాణం చేసేందుకు కొన్ని నెలల ముందు నుంచే టికెట్ బుక్ చేసుకోవాలి. ఇక వెయిటింగ్ లిస్ట్ ఉంటే పరిస్థితి అంతే. టికెట్ కన్ఫామ్ అవుతుందో తెలియక, బెర్త్ వస్తుందో లేదోననే టెన్షన్ ప్యాసింజర్లకు ఉంటుంది. సరిగ్గా చార్ట్ ప్రిపేర్ అయ్యే సమయంలో బెర్త్ కన్ఫామ్ కాదు. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడంతో పాటు.. ఇతర క్లాసుల్లో కష్టంగా ప్రయాణిస్తూ గమ్యస్థానాలకు చేరుకుంటారు. అలాంటి వారి ఇబ్బందులు గమనించిన ట్రైన్ మ్యాన్ ఓ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్వే ప్రయాణికులకు ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ట్రైన్ మ్యాన్ గుడ్ న్యూస్ చెప్పింది. అత్యవసర సమయాల్లో ట్రైన్‌ టికెట్‌ బెర్తు కన్ఫామ్ కాని ప్యాసింజర్ల కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

ట్రైన్‌ టికెట్ కన్ఫామ్ కాని సమయంలో ప్రయాణీకులకు ఆ రూట్లలో విమాన సదుపాయం ఉంటే ఫ్రీగా ఫ్లైట్‌ టికెట్‌లు అందిస్తామని వెల్లడించింది. ట్రిప్ అస్యూరెన్స్ అనే కొత్త ఫీచర్‌ను డెవలప్‌ చేసింది. దీని ద్వారా రైల్వే ప్రయాణీకులకు సీట్లు వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంటే వారికి టికెట్లను కన్ఫామ్ చేసి ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రయాణీకుడు కన్ఫామ్ టికెట్లను పొందనట్లయితే, చార్ట్ తయారీకి ముందు టికెట్‌లు కన్ఫామ్ కాకపోతే.. ట్రిప్ అస్యూరెన్స్ ఫీచర్‌ సాయంతో చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ట్రైన్‌ రూట్లు, టికెట్‌ సదుపాయాల్ని గుర్తించి బుక్ చేసుకోవడంలో ఉపయోగపడుతుంది.

టిక్కెట్ ప్రిడిక్షన్ మీటర్‌లో 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ అని సూచిస్తే.. యాప్ ట్రిప్ అస్యూరెన్స్ ఫీజు రూ.1 తీసుకుంటుంది. 90 శాతం కంటే తక్కువగా ఉంటే టికెట్ తరగతిని బట్టి ఛార్జీలు వసూలు చేస్తుంది. చార్ట్ ప్రిపరేషన్ సమయంలో రైలు టికెట్ కన్ఫామ్ అయినట్లయితే.. ఆ రుసుము కస్టమర్‌లకు రీఫండ్ చేస్తుంది. టికెట్ బుక్‌ కాకపోతే ప్రయాణికులకు ఉచితంగా ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌చేస్తామని ట్రైన్‌ మ్యాన్‌ సీఈవో వినీత్ చిరానియా ప్రకటించారు. ట్రిప్ అస్యూరెన్స్ సర్వీస్ ప్రస్తుతం అన్ని ఐఆర్‌సీటీ రాజధాని రైళ్లతో పాటు దాదాపు 130 ట్రైన్లలో సేవలు అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..