AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amith Shah: రేపే మునుగోడులో బీజేపీ సమర భేరి సభ.. హాజరుకానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..

మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్న సందర్భంగా ఆదివారం (ఆగస్టు 21) మునుగోడులో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ పేర్కొన్నారు.

Amith Shah: రేపే మునుగోడులో బీజేపీ సమర భేరి సభ.. హాజరుకానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
Home Minister Amit Shah (File Photo)Image Credit source: TV9 Telugu
Shaik Madar Saheb
|

Updated on: Aug 20, 2022 | 4:28 PM

Share

Tarun Chug: మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్న సందర్భంగా ఆదివారం (ఆగస్టు 21) మునుగోడులో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ పేర్కొన్నారు. యువనేత, తెలంగాణ ఉద్యమకారుడు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరుతున్న మునుగోడులో సమర భేరి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో కె చంద్రశేఖర్ రావు అవినీతి-రాజవంశ, నిరంకుశ పాలనను సమాధి చేయడంలో ఈ సభ దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఎనిమిదేళ్ల దుష్టపాలనపై ఆగ్రహంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని వివరించారు. తెలంగాణ ప్రజలకి టీఆర్ఎస్ చేస్తున్న ద్రోహానికి అండగా నిలుస్తామని భారతీయ జనతా పార్టీ సంకల్పించిందన్నారు. జనాభాలోని అన్ని వర్గాలకు పెనుముప్పుగా మారిన కుటుంబాన్ని, దుష్పరిపాలనను బహిర్గతం చేయడానికి తెలంగాణ బీజేపీ సంకల్పం తీసుకుందన్నారు. మునుగోడు బహిరంగ సభ రాష్ట్ర ప్రజల సామూహిక ఆగ్రహానికి సారాంశం కానుందని తరుణ్ చుగ్ ప్రకటనలో తెలిపారు.

మునుగోడు సమర భేరికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని టీఎస్ బీజేపీ ఇన్ఛార్జ్ తెలిపారు. రేపు బీజేపి చేపట్టిన సభపై కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులూ భయానికి గురవుతున్నారన్నారు. బీజేపీకి భయపడి సీఎంను ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వెళ్లేలా చేయడం.. బీజేపీ చేకూరిన నైతిక విజయమని తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక కీలక ఘట్టాన్ని రుజువు చేస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రగామిగా నిలిచిన ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యార్థులు ఈ సభకు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..