Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..
గోదావరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తుండగా బీబీనగర్ దగ్గర పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ట్రైన్ పట్టాలు తప్పిన ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
గోదావరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తుండగా బీబీనగర్ దగ్గర పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ట్రైన్ పట్టాలు తప్పిన ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, గోదావరి పట్టాలు తప్పడంతో పలు రైళ్లకు అంతరాయం కలిగింది. దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని 9 రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 17 రైళ్ల రాకపోకలను తాత్కలికంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల దృష్ట్యా పలు రైళ్లను పూర్తిగా.. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ వెల్లడించింది. ఇంకా కొన్నింటిని దారి మళ్లించినట్లు పేర్కొంది.
రద్దయిన రైళ్ల వివరాలివే..
- కాచిగూడ – నడికుడి (07791)
- నడికుడి – కాచిగూడ (07792)
- సికింద్రాబాద్ – వరంగల్ (07462)
- వరంగల్ – హైదరాబాద్ (07463)
- సికింద్రాబాద్ – గుంటూరు (12706)
- గుంటూరు – సికింద్రాబాద్ (12705)
- సికింద్రాబాద్ – రేపల్లె (17645)
- హైదరాబాద్ – కాజిపేట (07758)
- సికింద్రాబాద్ – భద్రాచలం రోడ్ (17659)
వీటితో పాటు మరికొన్నింటిని 19 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ ప్రకటించారు.
?ATTENTION PASSENGERS
Cancellation of Trains
*Update Upto 16.00 hrs today 15/02/2023* pic.twitter.com/ScBCsxcFJj
— South Central Railway (@SCRailwayIndia) February 15, 2023
సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ (17234), గుంటూరు-సికింద్రాబాద్ (17201), భద్రాచలం రోడ్డు-సికింద్రాబాద్ (17660) రైళ్లు కాజీపేట వరకు నడుస్తాయి. విజయవాడ-సికింద్రాబాద్ రైలు (12713) వరంగల్ వరకే నడుస్తుందని ప్రకటించారు.
?ATTENTION PASSENGERS
Diversion of Trains
Update Upto as on 16.00 hrs of 15/02/2023 pic.twitter.com/ZZbS9ErRUA
— South Central Railway (@SCRailwayIndia) February 15, 2023
గుంటూరు-వికారాబాద్ (12747) రైలును నల్గొండ వరకు, వరంగల్ సికింద్రాబాద్ (07757) రైలును ఆలేరు వరకు, మిర్యాలగూడ-కాచిగూడ రైలు (07974) రైలును రామన్నపేట వరకు మాత్రమే పరిమితం చేసినట్లు తెలిపారు.
గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన నేపథ్యంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని.. ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..