TSLPRB: పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 15 నుండి 25 వరకు ఫిజికల్ ఈవెంట్స్.. ఇవి తప్పనిసరి..
ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సంధించలేకపోయిన అభ్యర్థులకు హైకోర్టు ఉత్తర్వులతో 7 మార్కులు కలపడంతో పాటు 1 సెంటీమీటర్ ఎత్తులో అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులకు టీఎస్ఎల్‌పీఆర్బీ మరో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సంధించలేకపోయిన అభ్యర్థులకు హైకోర్టు ఉత్తర్వులతో 7 మార్కులు కలపడంతో పాటు 1 సెంటీమీటర్ ఎత్తులో అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులకు టీఎస్ఎల్‌పీఆర్బీ మరో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. TSLPRB ఫేజ్-II శారీరక దేహాదారుఢ్య పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి నుండి 10 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో 8,300 మంది పురుషులు, 3185 మంది మహిళ అభ్యర్థులు వున్నారు. ప్రతిరోజూ సుమారు 600 మంది వరకు అభ్యర్థులు హాజరు కానున్నారు. ఉదయం 5 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. ఇందులో ఉత్తీర్ణలైన వారు ఫైనల్ ఎగ్జామ్‌కు ఎంపికవుతారు. మైదానంలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. సర్టిఫికేట్ పరిశీలన నుంచి దేహదారుఢ్య పరీక్షల వరకూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి.. ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో నిర్వహించనున్నారు.
TSLPRB ద్వారా వివిధ జిల్లాల నుంచి 11,485 మంది అభ్యర్థులకు సంబంధించిన శారీరక దేహాదారుఢ్య పరీక్షలను కొండాపూర్ 8th బెటాలియన్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. వీరిలో 8,300 మంది పురుషులు, 3,185 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 600 మంది అభ్యర్థులకు నేడు శారీరక దేహాదారుఢ్య పరీక్షలు ఉండగా 383 మంది హాజరయ్యారు. ఇందులోనూ 71 మంది మాత్రమే అర్హత సాధించారు.
మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా 16, 17, 19 వ తేదీల్లో శారీరక దేహాదారుఢ్య పరీక్షలను నిర్వహించనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు విమర్శలకు తావు లేకుండా ఫిజికల్ ఈవెంట్స్ జరిగే మైదానంలో సీసీ కెమెరాలు నిఘా ఉంచుతున్నామని అధికారులు తెలిపారు. అభ్యర్థుల ఎత్తు కొలిచేందుకు డిజిటల్ మీటర్లు ఉపయోగిస్తున్నారని, పురుష అభ్యర్థులకు 1600 మీటర్లు పరుగుకు, మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగుకు ఆర్ఎఫ్ఐడి(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్) కార్డులను ఉపయోగించి అత్యాధునిక పరికరారులతో ఆటోమేటిక్‌గా రికార్డు నమోదు అయ్యేవిధంగా ఏర్పాట్లు చేశారు.
అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరు అయ్యే విధంగా ఈసారి నూతనంగా రెస్ట్ బ్యాండ్లను ఉపయోగించన్నున్నట్లు తెలిపారు. షాట్ పుట్ లాంగ్ జంప్ ఈవెంట్స్ లలో క్వాలిఫై మేరకు మాత్రమే నమోదు చేయబడుతుందని, పరుగులో మాత్రం అభ్యర్థికి మార్కులను కేటాయించనున్నట్లు తెలిపారు. ఇదంతా ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్ర పోలీసు నియామక మండలి బోర్డ్ సర్వర్లోకి అప్లోడ్ అవుతుందని అధికారులు తెలిపారు. ఎంపిక ప్రక్రియలో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు అధికారులు. దీనిపై ఫిబ్రవరి 13, 14న రెండు రోజులపాటు ట్రయల్ రన్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
మోసపూరిత మాటలు నమ్మొద్దు.. పోలీస్ ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగుతోందని ఎవరైనా అక్రమ మార్గంలో మేలు చేస్తామని చెబితే నమ్మి మోసపోవద్దని పోలీస్ అధికారులు తెలిపారు. ప్రతి అంశం టెక్నాలజీతో ముడిపడి ఉంటుందని, ఎక్కడా మానవ ప్రమేయం ఉండదని అన్నారు. ప్రతి బ్యాచ్ ఎంపిక ప్రక్రియ జరిగే సమయంలో ప్రతి అంశం సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని, తద్వారా దాన్ని భద్రపరుస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఏవైనా విమర్శలు వస్తే ఫుటేజీ ఆధారంగా విచారణ చేపడతారని అన్నారు. వేలిముద్రలు తీసుకున్న తర్వాతే అభ్యర్థుల్ని గ్రౌండ్‌లోకి అనుమతిస్తారని, అభ్యర్థులు ఫోన్లు, ఇతర వస్తువులను తీసుకురావద్దని, వాటిని భద్రపరిచేందుకు ఎలాంటి ఏర్పాట్లు ఉండవని అధికారులు తెలిపారు.
ఉదయం 5 గంటలకు హజరైన అభ్యర్థులకు మైదానంలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తు చర్యలలో భాగంగా శామినాలు (టెంట్స్), ప్రభుత్వ డాక్టర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్, అత్యవసర సమయంలో అంబులెన్స్, టాయిలెట్స్, మంచినీటి సాదుపాయం కల్పించారు. పరీక్షలు నిర్వహించే పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ ఎవరు ఇతరులు ప్రవేశించకుండా పోలీసు సిబ్బంది ద్వారా బందోబస్తు చర్యలను చేపట్టనున్నట్లు తెలిపారు.
కానిస్టేబుల్, ఎస్ఐ శారీక దేహదారుఢ్య పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది సూచనలు తప్పకుండా పాటించాలి..
? రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి జారీ చేసిన అనుమతి / సమాచార పత్రం ( admit card / intimation letter ) తమ వెంట తీసుకురావాలి. ? అభ్యర్థి స్వీయ సంతకముతో కూడిన పార్ట్ 2 అప్లికేషన్ ఫామ్. ? అభ్యర్థి స్వీయ సంతకాలతో కూడిన కుల ధ్రువీకరణ పత్రం జీరాక్స్ కాపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే జారీ చేయబడి ఉండాలి. ? అభ్యర్థి స్వీయ సంతకము కలిగిన మాజీ సైనిక దృవ పత్రం ( PPT / డిచార్జీ బుక్ ) /నో అబ్జెక్షన్ సర్టిఫికేటు ( ఇంకా సర్వీసు నుండి డిచార్జీ కానివారికి) ? అభ్యర్థి స్వీయ సంతకముతో కూడిన ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ ఫర్ ఆదివాసి, షెడ్యూల్డ్ తెగ G.O. MS 24, ట్రైబల్ వెల్ఫేర్ ( LTR 1 )
ఇవి కూడా తెలుసుకోవాలి..
? ప్రతీ అభ్యర్థి సిసి కెమెరాల నిఘాలో ఉంటారు. ? అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీలలో మాత్రమే శారీరక మరియు దేహాదారుఢ్య పరీక్షలకు హాజరవ్వాలి. ? అభ్యర్థులు పరీక్ష నిర్వాహణ కేంద్రంలోకి ప్రవేశించాక అన్ని రకాల పరీక్షలు ముగిసిన తరువాతే బయటకు అనుమతిస్తారు. అభ్యర్థులు అందుకు తగిన విధంగా సంసిద్ధులై రావాలి. ? అభ్యర్ధులు తమ వెంట దుస్తులు, ఆహార పానీయాలు వంటి అత్యవసరమైనవి మినహా ఎటువంటి విలువైన లేదా నిషేదిత వస్తువులను అనుమతించరు. ? అభ్యర్థులు ప్రతీ ఈవెంట్ వద్ద, పరిశీలన కేంద్రాల వద్ద ‘క్యూ’ పద్ధతిని పాటించాలి. ? సెల్‌ఫోన్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు అనుమతించడబవు. ? మహిళా అభ్యర్థులు తమ వాస్తవిక ఎత్తును ప్రభావితం చేయు ఎలాంటి అభ్యంతరకర శిరోజాలంకరణలు ధరించి పరీక్షకు హాజరుకారాదు. ? బయోమెట్రిక్ పద్దతిలో అభ్యర్థుల పరిశీలన ఉన్నందున చేతి వేళ్లకు గోరింటాకు, ఇతర రంగులు వేసుకుని రాకూడదు. ? పరీక్ష నిర్వాహణలో ప్రతి అభ్యర్థి అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలి. ? సర్టిఫికెట్లకు సంబంధించిన జీరాక్స్ మాత్రమే తీసుకురావాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..