AP EAPCET: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది ఈఏపీసెట్‌లో వెయిటేజీ కల్పిస్తూ నిర్ణయం..
ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఇంటర్ మార్కులకు ఈఏపీసెట్ లో మొత్తం 25 శాతం వెయిటేజీ ఇచ్చేవారు. కానీ కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించని నేపథ్యంలో..
ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఇంటర్ మార్కులకు ఈఏపీసెట్ లో మొత్తం 25 శాతం వెయిటేజీ ఇచ్చేవారు. కానీ కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించని నేపథ్యంలో ఈఏపీసెట్ పరీక్షకు ఇంటర్ వెయిటేజ్‌ను తీసేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే గతేడాది ఇంటర్ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఈసారి యదాతథంగా 25 శాతం ఇవ్వనున్నట్లు తాజాగా అధికారులు తెలిపారు. ఇది విద్యార్థులకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఈఏడాది ఈఏపీసెట్ పరీక్షకు హాజరయ్యే వారు గతేడాది ఫస్ట్ ఇయర్ పరీక్షకు హాజరయ్యారు. అదేవిధంగా ఈ ఏడాది సెకండ్ ఇయర్ పరీక్షలకు కూడా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు వెయిటేజ్‌ను ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఈఏడాది ఈఏపీసెట్ షెడ్యూల్ విషయానికొస్తే.. మే 15 నుంచి 22 వరకు ఎంపీసీ విభాగం ఎగ్జామ్స్ ను, మే 23 నుంచి 25 వరకు బైపీసీ విభాగంలో పరీక్షనునిర్వహించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఎగ్జామ్స్‌ను మార్చి 15వ తేదీ నుంచి నిర్వహిస్తారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..