IDBI Recruitment: బీటెక్ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు… ఎలా ఎంపిక చేస్తారంటే.
ప్రముఖ ప్రభుత్వ రంగం బ్యాంక్ అయిన ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ఐడీబీఐ బ్యాంకులో పలు స్పెషలిస్ట్, మేనేజర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?
ప్రముఖ ప్రభుత్వ రంగం బ్యాంక్ అయిన ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ఐడీబీఐ బ్యాంకులో పలు స్పెషలిస్ట్, మేనేజర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 114 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో మేనేజర్ (75), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (29), డిప్యూటీ జనరల్ మేనేజర్ (10) ఖాళీలు ఉన్నాయి.
* డిజిటల్ బ్యాంకింగ్ అండ్ ఎమర్జింగ్ పేమెంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎంఐఎస్, నెట్‌వర్క్, డేటా ఎనలిటిక్స్, ఆర్కిటెక్చరల్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్ లో బీసీఏ/బీటెక్/బీఎస్సీ/బీఈ/ఎంఎస్సీ/ఎంసీఏ/ఎంటెక్/ఎంఈ/ఎంఏ/ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా సంబంధిత విభాగంలో కనీసం 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ప్రిలిమినరీ స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా రూ. 48 వేల నుంచి రూ. 85 వేల వరకు చెతల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 21న మొదలవుతుండగా మార్చి 3తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..