AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో ఉద్యోగార్థులకు అలర్ట్‌.. ఆ పోస్టుల దరఖాస్తు తేదీని పొడగిస్తూ నిర్ణయం.

తెలంగాణలో వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్‌ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్స్‌ మొదలు ఇతర విభాగాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌లో స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం...

Telangana: తెలంగాణలో ఉద్యోగార్థులకు అలర్ట్‌.. ఆ పోస్టుల దరఖాస్తు తేదీని పొడగిస్తూ నిర్ణయం.
Telangana
Narender Vaitla
|

Updated on: Feb 16, 2023 | 1:42 PM

Share

తెలంగాణలో వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్‌ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్స్‌ మొదలు ఇతర విభాగాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌లో స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం విధితమే. తెలంగాణలో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ స్థాయిల్లో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల ప్రత్యక్ష నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

MHSRB నోటిఫై చేసిన 5,204 స్టాఫ్ నర్సుల పోస్టులలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కింద 3,823 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP)లో 757 పోస్టులు ఉన్నాయి. ఎంఎన్​జే ఆస్పత్రిలో 81 పోస్టులు సహా.. వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేసేలా ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. నిజానికి ఈ పోస్టుల దరఖాస్తు గడువు ముగిసింది. అయితే అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకున్న అధికారులు గడువు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Staff Nurses

ఇవి కూడా చదవండి

ఇందుకు సంబంధించిన దరఖాస్తు గడువును ఈ నెల 21వ తేదీ వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 21వ తేదీలోగా https://mhsrb.telangana.gov.in/ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చనని అధికారులు సూచించారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
బాత్రూంలో ఈ చిన్న వస్తువును పెట్టండి.. సంపద పెరుగుతుంది
బాత్రూంలో ఈ చిన్న వస్తువును పెట్టండి.. సంపద పెరుగుతుంది
అకస్మాత్తుగా ముఖాముఖి ఎదురుపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ..!
అకస్మాత్తుగా ముఖాముఖి ఎదురుపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ..!
టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
ఇంటి గుమ్మం వద్ద ఆవు నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా?
ఇంటి గుమ్మం వద్ద ఆవు నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా?
సేఫ్టీ పిన్ వెనుక ఈ రంధ్రం కనిపెట్టి.. బిలియన్ డాలర్ల సామ్రాజ్యం!
సేఫ్టీ పిన్ వెనుక ఈ రంధ్రం కనిపెట్టి.. బిలియన్ డాలర్ల సామ్రాజ్యం!