AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో ఇదేం పెళ్ళాం రా బాబు.. సుపారీ ఇచ్చిమరీ భర్తను లేపేసింది!

రోజురోజుకు మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయి. అగ్నిసాక్షిగా బంధువుల సమక్షంలో చేసుకున్న పెళ్లిళ్లకు విలువ లేకుండా పోతోంది. కట్టుకున్న భార్యలను, కలకాలం కలసి ఉండాల్సిన భర్తలను విస్మరిస్తూ వివాహేతర సంబంధాలతో కాపురాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు కొంతమంది. ఫలితంగా కడుపున పుట్టిన పిల్లలు, తమపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకరిని ఒకరు చంపుకోవడానికి సుపారీలు కూడా ఇస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..

వామ్మో ఇదేం పెళ్ళాం రా బాబు.. సుపారీ ఇచ్చిమరీ భర్తను లేపేసింది!
Wife Killed Her Husband
P Shivteja
| Edited By: Srilakshmi C|

Updated on: May 16, 2025 | 1:24 PM

Share

మెదక్, మే 16: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి హత్య చేసిందో భార్య. మెదక్ జిల్లా పరిధిలోని శమ్నాపూర్కు చెందిన మైలి శ్రీను అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ సడన్ గా ఏప్రిల్ 16 నుంచి కనిపించకుండాపోయాడు. అదే నెల 28న అతని భార్య లత ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. శ్రీను మిస్సింగ్ పై పోలీసులకు అనుమానం రావడంతో, శ్రీను భార్య అయిన లతను తమదైన స్టైల్ లో విచారించగా అసలు విషయం బయటపడింది.

గత కొద్ది రోజులుగా శ్రీను భార్య అయిన లత అదే గ్రామానికి చెందిన వరుసకు బావ అయ్యే మల్లేశం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం భర్త శ్రీనివాస్ కి తెలియడంతో లతను చాలాసార్లు మందలించడంతో పాటు, పలుమార్లు పెద్ద మనుషులతో పంచాయతీలు కూడా జరిగాయి. అయిన కూడా లత తీరులో మార్పు రాలేదు. ఇదే విషయంపై మళ్ళీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక ఇలా కుదరదు అని.. భార్య లత ఓ ప్లాన్ వేసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కడతేర్చాలని ప్రియుడు మల్లేశంతో కలిసి పథకం వేసింది లత. అదే గ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తికి రూ.50 వేల సుపారీ ఇచ్చింది. ఇక లత, మల్లేశం, మోహన్ ముగ్గురు కలిసి ఏప్రిల్ 16న మధ్యాహ్నం శ్రీనును బ్యాతోల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఫుల్లుగా మద్యం, కల్లు తాగించి తలపై సీసాతో కొట్టి చంపేశారు.

చేసిందంత చేసిన లత.. హత్య అనంతరం తనకు ఏం తెలియనట్లు భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణ జరపగా, జరిగిన విషయం తేలింది. దీంతో నిందితురాలు మైలి లత, ఆమె ప్రియుడు మల్లేశం, సుపారీ తీసుకున్న మోహన్లను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. నిందితులు చెప్పిన ఆధారాల ప్రకారం హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి చూడగా మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. దీంతో సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి మృతుదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. కాగా శ్రీను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు శ్రీను కుంటుంభ సభ్యులు. లత ఇంతటి ఘోరం చేస్తుంది అని ఊహించలేదని.. ఎన్ని సార్లు చెప్పిన ఆమె వ్యవహార శైలిలో మార్పు రాలేదని.. అందుకే లతకు కఠినమైన శిక్ష పడేలా చూడాలని శ్రీను కుటుంబ సభ్యులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.