AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అత్వెల్లిలో మహిళ దారుణ హత్య.. ముక్కు, చెవులు కోసి చంపిన వైనం..

మేడ్చ‌ల్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మ‌హిళను గుర్తు తెలియని వ్యక్తులు.. ముక్కు, చెవులు కోసి దారుణంగా హత్య చేశారు. ఆపై మృతదేహానికి నిప్పు పెట్టారు. ఇంటి నుంచి పొగలు రావడంతో స్థానికులు వెళ్లి చూడగా.. మహిళ సగం కాలిపోయిన స్థితిలో కనిపించింది.

Telangana: అత్వెల్లిలో మహిళ దారుణ హత్య.. ముక్కు, చెవులు కోసి చంపిన వైనం..
Atvelli
Ranjith Muppidi
| Edited By: |

Updated on: May 16, 2025 | 1:36 PM

Share

మనుషులు పర్వర్టుల్లా తయారువుతున్నారు. నేర ప్రవృత్తి నానాటికి పెరిగిపోతుంది. కొందరైతే అయినవాళ్లనే అంతమొందిస్తున్నారు. క్షణికావేశంలో జరుగుతున్నాయ్ అనుకోడానికి లేదు. పక్కా ప్లాన్‌తో హత్యలు చేస్తున్నారు. కొందరు సైకోల్లా క్రైమ్స్‌కు తెగబడుతున్నారు. హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నతండ్రే 14 రోజుల బిడ్డను పాశవికంగా గొంతు కోసి హత్య చేశాడు. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి అత్వెల్లి గ్రామంలో ఓ మహిళను అతి కిరాతకంగా గొంతు, చెవులు కోసి హత్య చేశారు. అనంతరం మృతదేహానికి నిప్పు పెట్టారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.

వికారాబాద్ జిల్లాకు చెందిన లక్ష్మి వయస్సు దాదాపు 50 ఏళ్లు ఉంటుంది. ఆమె అత్వెల్లిలో ఓ రేకుల షెడ్డూలో నివాసం ఉంటుంది. స్థానికంగా ఓ వైన్స్‌లో పనికి కుదిరింది. అక్కడ ఆమెకు రోజుకు ఇంత అని కూలి ఇస్తున్నారు. శుక్రవారం తెల్ల వారుజామున ఆమె ఉంటున్న రేకుల షెడ్‌కు పొగలు వ్యాపించడంతో.. స్థానికులు వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో సగం కాలిన స్థితిలో లక్ష్మి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గొంతు, చెవులు, ముక్కు కోసి హత్య చేసిన అనంతరం.. ఆ తర్వాత కాల్చివేసినట్టు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించి.. మృతదేమాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీసీ విజువల్స్ సాయంతో పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్