Telangana: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ కలకలం.. వాట్సాప్‌లో ప్రత్యక్షమైన క్వశ్చన్ పేపర్.
తెలంగాణలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం కలకలం రేపింది. పదో తరగతి పరీక్షలు మొదలైన తొలి రోజే ఇలా క్వశ్చన్ పేపర్ లీక్ కావడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. వికారాబాద్‌లో జిల్లాలో ఈరోజు ఉదయం 10వ తరగతి ప్రశ్నాపత్రం బయటకు వచ్చింది...
తెలంగాణలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం కలకలం రేపింది. పదో తరగతి పరీక్షలు మొదలైన తొలి రోజే ఇలా క్వశ్చన్ పేపర్ లీక్ కావడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. వికారాబాద్‌లో జిల్లాలో ఈరోజు ఉదయం 10వ తరగతి ప్రశ్నాపత్రం బయటకు వచ్చింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు పదో పరీక్ష మొదలుకాగా ఏడు నిమిషాల తర్వాత 9.37 గంటల తర్వాత క్వశ్చన్ పేపర్ వాట్సాప్ చక్కర్లు కొట్టింది. పరీక్ష ప్రారంభమైన తర్వాత క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చిందా..? ముందే లీక్ అయ్యిందా అన్న విషయాలు తెలిసియాల్సి ఉంది.
పేపీర్ లీకేజ్ విషయంలో వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. తాండూరు నంబర్ వన్ స్కూల్ లో బందెప్ప అనే టీచర్ ఉదయం 9.37 నిమిషాలకు తన ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్ లో క్వశ్చన్ పేపర్ ఫొటో పెట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫోటో ఎన్ని గంటలకు తీశారు ? పరీక్ష కంటే ముందే ఫోటో తీసి ఎవరికైనా ఇచ్చారా ?అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బందెప్ప ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే ప్రశ్నాపత్రం లీక్ కావడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రశ్నాపత్రం లీక్ కాలేదని వికారాబాద్ డీఈవో చెబుతున్నారు. పూర్తి విచారణ తర్వాత అసలు నిజాలు బయటకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా మొన్నటి మొన్న టీఎస్‌పీఎస్సీ లీకేజ్ వ్యవహారం సద్దుమణగక ముందే ఇప్పుడు టెన్త్ పేపర్ లీకేజ్ వార్తలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..