Vivo Y78t: వివో నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరలో 50 ఎంపీ కెమెరా..
వివో వై78టీ పేరుతో ఈ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. భారత మార్కెట్లోకి త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకురానున్నారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర భారత కరెన్సీ ప్రకారం రూ. 17,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మూన్ షాడో బ్లాక్, స్నోవీ వైట్ కలర్‌లో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే...

ప్రస్తుతం మార్కెట్లో కొత్త ఫోన్‌ల హవా నడుస్తోంది. పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునే పనిలో భాగంగా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు మార్కెట్లోకి కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఫోన్‌లను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే చైనాకు చెందిన పలు బ్రాండ్స్ కొత్త ఫోన్‌లను తీసుకురాగా, తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ వివో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది.
వివో వై78టీ పేరుతో ఈ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. భారత మార్కెట్లోకి త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకురానున్నారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర భారత కరెన్సీ ప్రకారం రూ. 17,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మూన్ షాడో బ్లాక్, స్నోవీ వైట్ కలర్‌లో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.64 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. 2,388 x 1,080 పిక్సెల్ రిజల్యూషన్ ఈ ఫోన్ సొంతం.
ఇక ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6జెన్ 1ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌లో 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్‌ను వివో వై77టీకి కొనసాగింపుగా తీసుకొచ్చారు. గత ఆగస్టులో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌కు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. దీంతో వివో దీనికి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో వై78టీ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం వివో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంది. అయితే భారత మార్కెట్లోకి ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందన్న దానిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ధరలో కూడా ఏమైనా మార్పులు ఉంటాయేమో చూడాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




