Electric Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 142 కి.మీ రేంజ్.. అందరి మనసులను దోచుకుంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్!
Electric Scooter: ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు హవా కొనసాగిస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల అవుతున్నాయి. ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలు ఏకంగా 142 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది..

Electric Scooter: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, నటి జూహీ చావ్లా యాజమాన్యంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల నిర్వహించిన “నైట్స్ అన్‌ప్లగ్డ్ 3.0” ఈవెంట్‌లో హీరో మోటోకార్ప్‌కు చెందిన Vida VX2 Plus KKR లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రత్యేక డిజైన్‌తో ఆకట్టుకున్న KKR ఎడిషన్:
KKR టీమ్ ఫియర్‌లెస్ స్పిరిట్, ఛాంపియన్‌షిప్ లెగసీని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ స్కూటర్ పర్పుల్, గోల్డ్ కలర్ కాంబినేషన్‌తో అద్భుతంగా కనిపిస్తుంది. పర్ల్ బ్లాక్ బాడీపై గోల్డెన్ హాఫ్‌టోన్ గ్రేడియెంట్ ఫినిషింగ్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. ఈ స్కూటర్‌లో కేకేఆర్ గెలిచిన మూడు ఐపీఎల్ ట్రోఫీలకు ప్రతీకగా మూడు ప్రత్యేక మార్కులు డిజైన్‌లో పొందుపరిచారు. అదనంగా సిగ్నేచర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ప్రత్యేక LED DRLs ఉండటంతో రాత్రి సమయంలో ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తుంది.
Lemon Pickle: అమ్మమ్మల కాలం నాటి నిమ్మకాయ నిల్వ పచ్చడి – పక్కా కొలతలతో.. ఇలా పెట్టారంటే ఏడాది పాటు ఫ్రెష్‌గా..!
అభిమానులకు ప్రత్యేక ఆఫర్:
Vida VX2 Plus KKR లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌తో పాటు KKR అభిమానులకు టీమ్ కలర్‌లో డిజైన్ చేసిన లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్ పొందే అవకాశం కూడా కల్పించారు. అదేవిధంగా “Vida Electrifying Player of the Match” అనే కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. IPL 2026లో KKR ఏ మ్యాచ్ గెలిచినా, ఆ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడికి అతని పేరు, జెర్సీ నంబర్‌తో కస్టమైజ్ చేసిన VX2 Plus KKR ఎడిషన్ స్కూటర్‌ను బహుమతిగా ఇస్తారు.
ధర, రేంజ్, స్పీడ్ వివరాలు:
భారత మార్కెట్లో Vida VX2 Plus స్కూటర్‌ను Battery-as-a-Service (BaaS) తో రూ.57,990కి, బ్యాటరీతో రూ.94,800 ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చు అయితే, కొత్తగా విడుదలైన VX2 Plus KKR లిమిటెడ్ ఎడిషన్ ధర రూ.1,15,990 (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి చార్జ్ చేస్తే 142 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు.
LPG Booking: దేశంలో గ్యాస్ బుకింగ్ నిబంధనలు మారాయని మీకు తెలుసా? ఇలా చేస్తే సిలిండర్ అందదు!
స్టైలిష్ డిజైన్, KKR బ్రాండింగ్, మంచి రేంజ్, ఆకర్షణీయ ఫీచర్లతో Vida VX2 Plus KKR లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ క్రికెట్ అభిమానులకు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు ఒక ప్రత్యేక ఎంపికగా నిలవనుంది.
Gold Price Today: దిమ్మదిరిగే షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. తులంపై భారీగా పెరుగుదల!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




