AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు..' చేతులు జోడించి మరీ యాంకర్ ఎమోషనల్ !!

‘ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు..’ చేతులు జోడించి మరీ యాంకర్ ఎమోషనల్ !!

Phani CH
|

Updated on: Mar 27, 2026 | 7:41 PM

Share

బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు బెట్టింగ్ వీడియోపై వివరణ ఇచ్చారు. గతంలో చేసిన పాత ప్రమోషన్ వీడియోను కొందరు కావాలనే వైరల్ చేస్తూ తనను టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పాత వీడియో అని, అప్పట్లో సరైన అవగాహన లేక చేసిన తప్పని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకున్నానని, అభిమానులు ఈ వీడియోలను నమ్మి మోసపోవద్దని, రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. బిగ్ బాస్‌ నాన్ స్టాప్-2022, బిగ్ బాస్ సీజన్ 7-2023 లలో… రెండు సార్లు కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన ఈమె తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. విజేతగా నిలవకున్నా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టీవీ షోస్, సినిమా ఈవెంట్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం తెలుగులో బిజీయెస్ట్ యాంకర్ గా ఉన్న స్రవంతి సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపించింది. రీసెంట్‌గా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈక్రమంలోనే ఆమెకు సంబంధించిన ఓ బెట్టింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీంతో స్రవంతి.. వివరణ ఇస్తూ.. తనపై కుట్ర చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సదరు కాంట్రవర్సీ వీడియోపై క్లారిటీ ఇస్తూ.. అది ఇప్పటిది కాదని, చాలా కాలం క్రితం చేసిన పాత ప్రమోషన్ అని స్రవంతి స్పష్టం చేసింది. తనకు వీటిపై సరైన అవగాహన లేని టైంలో చేసిన తప్పని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు కావాలనే ఆ పాత వీడియోను మళ్ళీ వైరల్ చేయడాన్ని తప్పుబట్టింది. కొందరు కావాలనే ఈ పాత వీడియోని తెరపైకి తెచ్చి తనను టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలను, వివరణను ఇప్పటికే సంబంధిత అధికారులకు సమర్పించినట్లు స్రవంతి వెల్లడించింది. చట్టపరంగా చేయాల్సిన ప్రతి పనిని పూర్తి చేశానని, ఇప్పుడు కొత్తగా దీనిపై చర్చించాల్సిన అవసరం లేదని ఆమె తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పాత వీడియోలను చూసి మోసపోవద్దని తన అభిమానులకు , సామాన్య ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఆ వీడియో ఎక్కడ కనిపించినా వెంటనే ‘రిపోర్ట్’ చేయమని చేతులు జోడించి మరీ రిక్వెస్ట్ చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా

సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ

పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని నమ్మబలికి.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి

డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టుకథలా.. స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు

Srinu Vaitla: స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు

Published on: Mar 27, 2026 07:36 PM
Follow Us