ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'ధురంధర్ 2' వేల కోట్లు వసూలు చేసి రికార్డులు బద్దలు కొట్టినా, మరోవైపు ఓటీటీలో చిన్న సినిమా 'మేడ్ ఇన్ కొరియా' అనూహ్య సంచలనం సృష్టిస్తోంది. ప్రియాంక మోహన్ నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో నాన్-ఇంగ్లీష్ కేటగిరీలో 'ధురంధర్ 2'ని అధిగమించి టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ ఓటీటీ సినిమా సాధించిన అద్భుత విజయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ధరంధర్ 2 సినిమా దుమ్మురేపుతుంది. ఉగాది కానుకగా రిలీజైన ధురందర్ 2 మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సుమారు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఇంటెన్స్ డ్రామాతో మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ధురంధర్ 2 సినిమా ఇప్పటికే అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. హిందీతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ధరంధర్ 2 మూవీ రూ. 1000క్లొట్ల మార్క్ ను దాటేసింది.అయితే ధురంధర్ 2 హాట్ టాపిక్ అవుతున్న వేళ.. ధురంధర్ పార్ట్ 1 సినిమాను వెనక్కి నెట్టి మరీ.. ఓ చిన్న సినిమా… ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఎలాంటి అంచనాలు లేకండా వచ్చిన ఓ చిన్న సినిమా.. అది కూడా థియేటర్స్ లో కాకుండా ఓటీటీలో విడుదలైన ఆ సినిమా ధురంధర్ సినిమాను వెనక్కి నెట్టేసింది. ఆ సినిమా మరేదో కాదు యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించిన ‘మేడ్ ఇన్ కొరియా’. మార్చి 12న ఈ సినిమా.. నేరుగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి వచ్చేసింది. ఓటీటీలోకి వచ్చిన మేడ్ ఇన్ కొరియా సినిమా.. మొదటి వారంలోనే నంబర్ ప్లేస్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అంతే కాదు ఇప్పటికీ అంటే రెండు వారాలు పూర్తి అయినా కూడా ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ -ఇంగ్లీష్ కేటగిరీలో దురంధర్ చిత్రాన్ని వెనక్కి నెట్టి మొదటిస్థానంలో కొనసాగుతోంది ఈ చిన్న సినిమా. ఈ విషయాన్ని డైరెక్టర్ కార్తీక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ
పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని నమ్మబలికి.. యావర్ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి
డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టుకథలా.. స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు
Srinu Vaitla: స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు.. ఏం జరిగిందంటే
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!
పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్ చూసి అంతా..
రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్ కు రూ. 10 లక్షల జరిమానా
కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు
నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు
మిస్ ఏలూరుగా..దివ్య!

