AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు.. ఏం జరిగిందంటే

గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు.. ఏం జరిగిందంటే

Phani CH
|

Updated on: Mar 27, 2026 | 5:31 PM

Share

అనకాపల్లి జిల్లాలో ఓ రైతు తన పశువుల పాకలో నిద్రిస్తుండగా 13 అడుగుల భారీ గిరినాగు కనిపించడంతో భయంతో పరుగులు తీశాడు. వెంటనే స్నేక్ క్యాచర్ వెంకటేష్ వచ్చి, రెండు గంటలు శ్రమించి పామును సురక్షితంగా బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ అనూహ్య సంఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆరుగాలం కష్టపడి, అలసిపోయి పశువుల పాకలో నిద్రపోయిన ఆ రైతుకు.. తను మృత్యువు అంచున ఉన్నానని తెలియదు. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా సాక్షాత్తూ యమపాశంలా బుసలు కొడుతున్న భారీ గిరినాగు! వెన్నులో వణుకు పుట్టించే ఈ ఘటన అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గదబూరు గ్రామంలో చోటుచేసుకుంది. గదబూరుకు చెందిన శేఖర్ అనే రైతు ఎప్పటిలాగే తన పశువుల షెడ్డులో నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో ఏదో వింత శబ్దం వినిపించడంతో ఏమై ఉంటుందా అని నిద్రనుంచి లేచి కూర్చున్నాడు. చుట్టూ చీకటి.. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో లైటు వేసి చుట్టూ చూశాడు.. అంతే శేఖర్‌కు గుండె ఆగినంత పనైంది. ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చిన సుమారు 13 అడుగుల భారీ గిరినాగు అక్కడ తిష్ట వేసి ఉంది. తన మంచానికి అడుగు దూరంలో చుట్టు చుట్టుకొని ఉన్న అంతపెద్ద పామును చూసిన శేఖర్, భయంతో వణికిపోతూ ప్రాణాలు అరచేత పట్టుకుని అక్కడి నుండి పరుగులు తీశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ రెండు గంటల పాటు ప్రాణాలకు తెగించి పాముతో పోరాడాడు. ఎట్టకేలకు ఆ గిరినాగును చాకచక్యంగా బంధించారు. ఈ క్రమంలో సెల్ఫీలు, వీడియోల కోసం జనం ఎగబడటంతో కాసేపు అక్కడ వాతావరణం ఉత్కంఠగా మారింది. అనంతరం ఆ 13 అడుగుల గిరినాగును సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి

తిరుమలలో గోల్డ్‌మ్యాన్‌.. ఒళ్లంతా బంగారంతో..

రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌ !! టికెట్‌ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్‌

ట్రాఫిక్‌ చలాన్లు ఎగ్గొడుతున్నారా.. మీకో షాకింగ్‌ న్యూస్‌ !!

సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!

Follow Us