తిరుమలలో గోల్డ్‌మ్యాన్.. ఒళ్లంతా బంగారంతో..
హైదరాబాద్‌కు చెందిన సూర్య భాయ్ తిరుమల శ్రీవారిని కిలోల కొద్దీ బంగారంతో దర్శించుకున్నారు. శ్రీవాణి దర్శనంలో భాగంగా గత ఏడాది మొక్కుకున్న భారీ బంగారు కడియాన్ని ధరించి స్వామివారిని సందర్శించారు. భక్తులను ఆశ్చర్యపరిచిన ఆయన ఆభరణాలు, సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శ్రీవారిపై తన భక్తిని చాటుకున్న సూర్య భాయ్ సందడి అందరినీ ఆకట్టుకుంది.
తిరుమల శ్రీవేంకటేశ్వరుడు అలంకార ప్రియుడని అందరికీ తెలుసు. అందుకే స్వామివారిని దర్శించుకోడానికి వెళ్లే భక్తులు కూడా ఎంతో సంప్రదాయబద్ధంగా చక్కగా అలంకరించుకొని వెళ్తారు.. ఆపద మొక్కులవాడిని ఆదుకోమని వేడుకుంటూ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలోనే ఓ భక్తుడు బంగారు స్వామివారిని దర్శించుకోడానికి ఒళ్లంతా బంగారం ధరించి వచ్చాడు. ఒంటినిండా కిలోలకొద్దీ బంగారు ఆభరణాలు ధరించి వచ్చిన అతడిని ఇతర భక్తులు ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. హైదరాబాదు ఓల్డ్ సిటీ కి చెందిన సూర్య భాయ్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవాణి దర్శన సమయం లో శ్రీవారికి మొక్కులు చెల్లించిన సూర్య భాయ్, తిరుమల ఆలయం ముందు భక్తులను ఆకట్టు కున్నాడు. గత ఏడాది శ్రీవారిని దర్శించుకున్న సమయంలో సూర్యభాయ్ ఒక వినూత్నమైన మొక్కు మొక్కుకున్నారు. దేశంలో మరెవరికీ లేని విధంగా, అత్యంత భారీ స్థాయిలో ఉండే ‘బంగారు కడియాన్ని’ ధరించి స్వామివారిని దర్శించుకుంటానని ఆయన సంకల్పించుకున్నారు. అన్నట్లుగానే ఈ ఏడాది శ్రీవారి నామాలు, కిరీటం, శంఖుచక్రాలతో కూడిన భారీ బంగారు కడియాన్ని చేయించుకుని, దానిని ధరించి శ్రీవాణి దర్శనం ద్వారా వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. మెడలో భారీ గొలుసులు, చేతులకు భారీ కడియాలు, వేళ్లకు నిండుగా ఉంగరాలు ధరించి ఆలయం వెలుపలకు వచ్చిన సూర్యభాయ్‌ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా సూర్యభాయ్ .. “శ్రీవారిని నమ్ముకుంటే కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయి. స్వామివారి పై ఉన్న భక్తితోనే ఈ ఆభరణాలను ధరించాను” అని పేర్కొన్నారు. ప్రస్తుతం తిరుమల మాడ వీధుల్లో ఈ బంగారు భక్తుడి సందడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్వే ప్రయాణికులకు అలర్ట్ !! టికెట్ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్
ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా.. మీకో షాకింగ్ న్యూస్ !!
సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!
సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!
పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్ చూసి అంతా..
రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్ కు రూ. 10 లక్షల జరిమానా
కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు
నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు
మిస్ ఏలూరుగా..దివ్య!
ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ

