AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్‌ కు రూ. 10 లక్షల జరిమానా

రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్‌ కు రూ. 10 లక్షల జరిమానా

Phani CH
|

Updated on: Mar 27, 2026 | 4:54 PM

Share

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో భోజనం నాణ్యతపై రాజీపడబోమని కేంద్ర రైల్వే శాఖ స్పష్టం చేసింది. పాట్నా-టాటానగర్ వందే భారత్ రైలులో పురుగులున్న భోజనం వడ్డించినందుకు ఐఆర్‌సీటీసీకి ₹10 లక్షల జరిమానా విధించింది. క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్టు రద్దు చేసి ₹50 లక్షలు ఫైన్ వేసింది. ప్రయాణికుల భద్రత, ఆహార నాణ్యతే తమ ప్రథమ ప్రాధాన్యమని రైల్వే స్పష్టం చేసింది.

ప్రీమియం రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆహారం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని కేంద్ర రైల్వే శాఖ స్పష్టం చేసింది. పాట్నా-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో నాసిరకం భోజనం వడ్డించినందుకు. తన సొంత సంస్థ అయిన ఐఆర్‌సీటీసీ పై రైల్వే శాఖ రూ. 10 లక్షల భారీ జరిమానా విధించింది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో అందించిన ఆహారంలో పురుగులు కన్పించడం తీవ్ర వివాదాస్పదమైంది. తమకు ఇచ్చిన భోజనంలో పురుగులు ఉన్నాయంటూ రితేష్‌కుమార్‌ అనే ప్రయాణికుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన రైల్వేశాఖ.. ఐఆర్‌సీటీసీకి జరిమానా విధించింది. రితేశ్‌కుమార్‌ మార్చి 15న పట్నా-టాటానగర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఆ సమయంలో తమకు అందించిన భోజనంలోని పెరుగులో పురుగులు రావడంతో ఆయన కంగుతిన్నారు. వెంటనే మేనేజర్‌ని పిలిచి ఫిర్యాదు చేశారు. రైలు సిబ్బంది ఆ భోజనాన్ని పరిశీలించారు. ఇదంతా రితేశ్ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇదికాస్తా వివాదాస్పదం కావడంతో రైల్వే మంత్రిత్వశాఖ ఎక్స్‌లో స్పందించింది. రూ.10 లక్షల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఆ రైల్లో కేటరింగ్‌ చేసిన ఫుడ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌కు రూ.50 లక్షల జరిమానాతో పాటు అతడి కాంట్రాక్టును రద్దు చేసినట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత, రైల్వే సౌకర్యాల్లో నాణ్యతే తమ ప్రథమ ప్రాధాన్యమని రైల్వేశాఖ వివరించింది. భారత రైల్వే ఏటా దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోంది. అందులో ఫిర్యాదుల శాతం కేవలం 0.0008 శాతం మాత్రమే ఉంది. వీటిలో ధరల వ్యత్యాసం వంటివి కూడా ఉన్నాయి. గత మూడేళ్లలో ఇలాంటి ఫిర్యాదులపై విచారణ జరిపి సుమారు రూ. 2.6 కోట్ల వరకు జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు. అయితే 2025లో ప్యాంట్రీ కార్ సిబ్బంది ప్రయాణికులపై దాడులకు దిగిన మూడు ఘటనలు నమోదు అయ్యాయని.. ఆ సిబ్బందిపై రైల్వేపోలీస్‌ చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు

రెస్టారెంట్లకు కేంద్రం సీరియస్ వార్నింగ్.. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఇక అంతే సంగతులు

RCB: బాస్‌ మారారు.. ఆర్సీబీ పేరుకూడా మారుతుందా ??

గుడ్‌ న్యూస్‌.. ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపల కూర

Follow Us