గుడ్ న్యూస్.. ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపల కూర
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తీపి కబురు అందించింది. ఇకపై మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో పాటు చేపల కూరను అందిస్తారు. ప్రత్యేకంగా, ముళ్ళు తక్కువగా ఉండే 'తిలాపియా' చేపలను ఎంపిక చేశారు. దీనివల్ల పిల్లలకు పోషకాహారం అంది, హాజరు శాతం పెరుగుతుందని, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేస్తుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. ఈ నిర్ణయం విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యతను చాటుతుంది.
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక తీపి కబురు అందించింది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో పాటు పౌష్టికాహారం అందిస్తుండగా, ఇకపై ఆ మెనూలో చేపల కూరను కూడా చేర్చనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీలో వెల్లడించారు. ఈ అంశంపై ఇప్పటికే కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. చేపల్లో ఉండే ముళ్ల వల్ల పిల్లలకు ప్రమాదం కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచన చేసింది. కేవలం మధ్యలో ఒక్కటే వెన్నుముల్లు ఉండే ‘తిలాపియా’ అనే ప్రత్యేక జాతి చేపలను విద్యార్థుల కోసం పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల చిన్న పిల్లలు సైతం ఎటువంటి ఇబ్బంది లేకుండా, భయం లేకుండా చేపల కూరను ఆస్వాదించవచ్చని వివరించారు. గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ ఇప్పటికే దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, పశుసంపదను మరింత బలోపేతం చేస్తామని మంత్రి గుర్తుచేశారు. కేవలం ఆహారమే కాకుండా, గ్రామస్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కూడా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరగడమే కాకుండా, వారిలో పోషకాహార లోపం తగ్గుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేది అప్పుడే !!
ఇండస్ట్రీలో విషాదం.. యంగ్ హీరోయిన్
Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్.. బంగారం,వెండి ధరలకు రెక్కలు
ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే
ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

