RCB: బాస్ మారారు.. ఆర్సీబీ పేరుకూడా మారుతుందా ??
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రికార్డు ధర రూ.16,660 కోట్లకు ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియానికి విక్రయించబడింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా ఇది నిలిచింది. జట్టు పేరు 'ఆర్సీబీ' మారదని అనన్య బిర్లా స్పష్టం చేశారు. 2025లో తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏడాదిలోనే ఈ సంచలనాత్మక కొనుగోలు జరిగింది. పురుషుల, మహిళల జట్ల హక్కులు బదిలీ అయ్యాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే సంచలనం నమోదైంది. అత్యంత ప్రజాదరణ కలిగిన ఫ్రాంచైజీలలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతులు మారింది. సుమారు 1.78 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.16,660 కోట్ల రికార్డు ధరకు ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్ (ఏబీజీ) నేతృత్వంలోని ఓ కన్సార్టియం కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఇప్పటివరకు ఆర్సీబీ యాజమాన్య హక్కులు కలిగిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్), తన 100 శాతం వాటాను ఈ కన్సార్టియంకు విక్రయించినట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ కొనుగోలులో ఆదిత్య బిర్లా గ్రూప్‌తో పాటు అమెరికన్ ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్ (బోల్ట్ వెంచర్స్), బ్లాక్‌స్టోన్ (BXPE), మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ ఒప్పందంతో ఐపీఎల్ పురుషుల జట్టుతో పాటు, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆడే మహిళల జట్టు హక్కులు కూడా కొత్త యాజమాన్యానికి బదిలీ అయ్యాయి. ఇదిలా ఉంటే.. యాజమాన్యం మారిన నేపథ్యంలో జట్టు పేరు కూడా మారుతుందేమోనని అభిమానులు ఆందోళన చెందారు. అయితే, జట్టు పేరులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అనన్య బిర్లా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఆర్సీబీ పేరు యథాతథంగా కొనసాగుతుందని పరోక్షంగా స్పష్టత ఇచ్చారు. 2008లో ప్రారంభమైన ఆర్సీబీ, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2025లో తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుని తన సత్తా చాటింది. టైటిల్ గెలిచిన ఏడాదిలోనే ఇంత భారీ ధరకు అమ్ముడుపోవడం విశేషం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్ కు రూ. 10 లక్షల జరిమానా
కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు
నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు
మిస్ ఏలూరుగా..దివ్య!
ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ
ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్!

