నగరంలో గ్యాస్ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి
దేశంలో గ్యాస్ సంక్షోభం సామాన్యుల సహనాన్ని పరీక్షిస్తోంది. సిలిండర్ బుక్ చేసినా డెలివరీ ఆలస్యం కావడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షేక్‌పేట్‌లో గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న డెలివరీ వాహనాన్ని అడ్డుకుని సిలిండర్లను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారాల తరబడి గ్యాస్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఈ సమస్యపై వెంటనే దృష్టి సారించి సరైన పంపిణీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశంలో గ్యాస్ సంక్షోభం సామాన్యుల సహనాన్ని పరీక్షిస్తోంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా డెలివరీ కాకపోవడంతో వినియోగదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న వాహనాన్ని అడ్డుకుని సిలిండర్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఫిలింనగర్ పరిధిలోని షేక్‌పేట్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. షేక్‌పేట్‌లోని ఒక ప్రముఖ గ్యాస్ ఏజెన్సీ నుండి సిలిండర్ల లోడుతో ఆటో బయటకు వచ్చింది. అప్పటికే గ్యాస్ సిలిండర్ కోసం ఏజెన్సీ బయట నిరీక్షిస్తున్న వినియోగదారులు ఆటోను గమనించి ఒక్కసారిగా చుట్టుముట్టారు. అనుమతి లేకుండానే ఆటోలోని సిలిండర్లను బలవంతంగా దించేందుకు ప్రయత్నించారు. దీంతో ఏజెన్సీ సిబ్బందికి, వినియోగదారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వారాల తరబడి గ్యాస్ కోసం ఎదురుచూస్తున్నామని, ఫోన్ చేస్తే ఏజెన్సీ వారు సరైన సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ లేక, ఇంట్లో పొయ్యి వెలగక ఇబ్బందులు పడుతున్నాం అంటూ వినియోగదారులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఏజెన్సీ సిబ్బంది స్థానికుల సహాయంతో వారిని అడ్డుకుని, ఆటోను ముందుకు కదిలించారు. ఈ ఘటనతో షేక్‌పేట్ ప్రధాన రహదారిపై కాసేపు ఉద్రిక్తత నెలకొంది. గ్యాస్ పంపిణీలో జరుగుతున్న జాప్యంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమలలో గోల్డ్‌మ్యాన్.. ఒళ్లంతా బంగారంతో..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్ !! టికెట్ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్
ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా.. మీకో షాకింగ్ న్యూస్ !!
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!
పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్ చూసి అంతా..
రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్ కు రూ. 10 లక్షల జరిమానా
కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు
నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు
మిస్ ఏలూరుగా..దివ్య!

