Srinu Vaitla: స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు
ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల రియల్ ఎస్టేట్ మోసానికి గురయ్యారు. వికారాబాద్ జిల్లా చేవెళ్లలో వ్యవసాయ భూమి కొనుగోలులో ఫోర్జరీ పత్రాలతో ఆయన్ను మోసగాళ్లు నమ్మించారు. రూ. 1 కోటి చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమికి అసలు యజమానులు వేరేవారని కోర్టు తీర్పుతో తెలిసింది. దీని ప్రస్తుత విలువ సుమారు రూ. 7 కోట్లు. మోసం గ్రహించిన శ్రీను వైట్ల హైదరాబాద్ CCS పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు శ్రీను వైట్ల, రియల్ ఎస్టేట్ మోసానికి గురయ్యారు. వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో వ్యవసాయ భూమి కొనుగోలు వ్యవహారంలో కొందరు వ్యక్తులు ఆయన్ని నమ్మించి నిలువునా ముంచేశారు. కొన్నేళ్ల క్రితం వికారాబాద్ జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు శ్రీను వైట్లను కలిశారు. తమకు చేవెళ్లలో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని విక్రయిస్తున్నామని నమ్మబలికారు. వారు చూపించిన పత్రాలను నమ్మిన దర్శకుడు, ఆ భూమిని కొనుగోలు చేసేందుకు సుమారు రూ. 1 కోటి వరకు చెల్లించారు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇటీవలి వరకు ఆ భూమి తనదేనని భావించిన శ్రీను వైట్లకు కోర్టు తీర్పుతో గట్టి షాక్ తగిలింది. ఆ స్థలం అసలు యజమానులు వేరే వ్యక్తులని, మోసగాళ్లు ఫోర్జరీ పత్రాలతో లేదా తప్పుడు సమాచారంతో ఆయన్ని నమ్మించారని తేలిపోయింది, ప్రస్తుతం ఆ భూమి మార్కెట్ విలువ సుమారు రూ. 7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తమను మోసం చేసి, వేరే వాళ్ల స్థలాన్ని తనకు అంటగట్టినట్లు గుర్తించిన శ్రీను వైట్ల వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ మోసంపై ఆయన హైదరాబాద్ CCS పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు.. ఏం జరిగిందంటే
నగరంలో గ్యాస్ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి
తిరుమలలో గోల్డ్‌మ్యాన్.. ఒళ్లంతా బంగారంతో..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్ !! టికెట్ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్
ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా.. మీకో షాకింగ్ న్యూస్ !!
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!
పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్ చూసి అంతా..
రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్ కు రూ. 10 లక్షల జరిమానా
కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు
నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు
మిస్ ఏలూరుగా..దివ్య!

