AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టుకథలా.. స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు

డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టుకథలా.. స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు

Phani CH
|

Updated on: Mar 27, 2026 | 7:25 PM

Share

గౌతమ్ మీనన్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. RS ఇన్ఫోటైన్‌మెంట్ నుండి తీసుకున్న ₹4.25 కోట్లను తిరిగి చెల్లించాలంటూ కోర్టు తీర్పునిచ్చింది. మే 2010 నుండి 12% వార్షిక వడ్డీని కూడా కట్టాలని ఆదేశించింది. తన వాదనను తోసిపుచ్చడంతో, గౌతమ్ మీనన్ సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

సౌత్ ఫిల్మ్ ఫెటర్నిటీలో మంచి స్టోరీ టెల్లర్‌గా నామ్ కమాయించిన గౌతమ్‌ మీనన్‌కు ఇప్పుడు బిగ్ ఝలక్ తగిలింది. కోర్టు ముందు కూడా.. గౌతమ్‌ మీనన్‌ స్టోరీలు చెప్పే ప్రయత్నం చేయడంతో.. కోర్టు ఆయనపై సీరియస్ అయింది. సీరియస్ అవ్వడమే కాదు.. భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే అంటూ తీర్పు నిచ్చింది. ఇక అసలు విషయం ఏంటంటే.. 2008లో తన ఫోటాన్ ఫ్యాక్టరీస్‌ ప్రొడక్షన్లో ఒక తమిళ సినిమా తెరకెక్కించేందుకు RS ఇన్ఫోటైన్ మెంట్ దగ్గర 4.25 కోట్ల రూపాలయను ఒప్పందం రూపంలో తీసుకున్నాడు గౌతమ్ మీనన్. అయితే ఈ తర్వాత ఈ సినిమాను కొన్ని కారణాల వల్ల పక్కన పెట్టినప్పటికీ.. RS ఇన్ఫోటైన్మెంట్‌కు మాత్రం తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వలేదు. దీంతో ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ గౌతమ్‌ మీనన్ పై అప్పట్లోనే మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. అప్పటి నుంచి సాగుతున్న ఈ వివాదం తాజాగా కోర్టు విచారణకు వచ్చింది. ఈక్రమంలోనే గౌతమ్ మీనన్.. ఒప్పందం ప్రకారం ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్‌కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తన వాదనను బలంగా వినిపించాడు. తాము తీసిన ‘నీతానే ఎన్ పొన్వసంతం’ చిత్రాన్ని ఆర్‌ ఎస్ ఇన్ఫోటైన్మెంట్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం తెరకెక్కించామని కోర్టుకు వివరించాడు. అయితే, ఆ సినిమా వేరే ఒప్పందం కింద రూపొందిందని పేర్కొంటూ కోర్టు గౌతమ్ వాదనను తోసిపుచ్చింది. తమ దగ్గర కథలు చెప్పొద్దు అంటూ హెచ్చరించింది. ఆర్.ఎస్. ఇన్ఫోటైన్‌మెంట్ దగ్గర గౌతమ్ మీనన్ తీసుకున్న 4.25 కోట్లను తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.అంతేకాదు ఈ మొత్తంపై మే 2010 నుంచి 12 శాతం వార్షిక వడ్డీని కూడా చెల్లించాల్సిందే అంటూ గౌతమ్‌ను ఆదేశించింది. అయితే కోర్టు తీర్పుతో అసంతృప్తిగా ఉన్న గౌతమ్ మీనన్‌.. సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Srinu Vaitla: స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు

గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు.. ఏం జరిగిందంటే

నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి

తిరుమలలో గోల్డ్‌మ్యాన్‌.. ఒళ్లంతా బంగారంతో..

రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌ !! టికెట్‌ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్‌

Follow Us