AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై  బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ

సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ

Phani CH
|

Updated on: Mar 27, 2026 | 7:31 PM

Share

ధురంధర్ 2 సినిమా వివాదంలో ఆర్. మాధవన్ ఒక సన్నివేశంలో 'దశమ్ గ్రంథం' శ్లోకాలు చదువుతూ సిగరెట్ తాగుతూ కనిపించారని సిక్కు సంస్థలు ఫిర్యాదు చేశాయి. ఇది మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని నిరసనలు తెలుపగా, మాధవన్ క్షమాపణలు చెప్పారు. తెరపై శ్లోకాలు చదువుతున్నప్పుడు తాను ధూమపానం చేయలేదని, ఉద్దేశపూర్వకంగా తప్పు జరగలేదని వివరించారు.

ధురంధర్ 2 మూవీ వివాదంలో చిక్కుకుంది. ధురంధర్ సినిమాలోని ఒక సన్నివేశంలో, గురు గోవింద్ సింగ్ రచించిన పవిత్ర ‘దశమ్ గ్రంథం’లోని శ్లోకాలను పఠిస్తూ నటుడు ఆర్. మాధవన్ సిగరెట్ తాగుతూ కనిపించారు. ఇది సిక్కు సమాజపు మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని మహారాష్ట్ర సిక్కు సంస్థ అధ్యక్షుడు గుర్జోత్ సింగ్ కీర్ ఫిర్యాదు చేశారు. గురుబానీ కేవలం ఒక సంభాషణ కాదని.. అది దైవికమైనదని.. పవిత్రమైనదన్నారు. సిగరెట్ తాగుతూ దానిని పఠించడం క్షమించరాని నేరం అంటూ గుర్‌జోత్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు చిత్ర బృందం బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే, దర్శకుడు ఆదిత్య ధర్, నటులు రణవీర్ సింగ్, మాధవన్ కనిపించే ప్రతిచోటా నల్ల జెండాలు ప్రదర్శించి నిరసన తెలుపుతామని సిక్కు సంస్థలు హెచ్చరించాయి. దీంతో ఈ వివాదంపై నటుడు ఆర్. మాధవన్ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ క్షమాపణలు చెప్పారు. “నేను ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. సినిమాలో శ్లోకం పఠించే ముందు నేను సిగరెట్ తీసుకున్నాను. తెరపై ఎక్కడా కూడా సిగరెట్ తాగుతూ శ్లోకం పఠించే సన్నివేశం లేదు. దర్శకుడు ఆదిత్య ధర్ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. మాకు సిక్కు సమాజం పట్ల అపారమైన గౌరవం ఉంది. నేను సినిమా విడుదలకు ముందు కచ్చితంగా స్వర్ణ దేవాలయాన్ని సందర్శిస్తాను. ఈ పొరపాటు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు” అని ఆర్. మాధవన్ చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని నమ్మబలికి.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి

డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టుకథలా.. స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు

Srinu Vaitla: స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు

గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు.. ఏం జరిగిందంటే

నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి

Follow Us