సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు, వేధింపులు, సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్రం కీలక ప్రతిపాదన చేసింది. బ్యాంక్ ఖాతాల మాదిరిగానే సోషల్ మీడియా అకౌంట్లకు KYC (మీ కస్టమర్‌ను తెలుసుకోండి) తప్పనిసరి చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదించింది. ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాలతో అనుసంధానం చేయడం ద్వారా ఫేక్ ప్రొఫైల్స్‌ను నియంత్రించి, ఆన్లైన్ భద్రతను మెరుగుపరచడమే దీని లక్ష్యం.