ఏపీలో భానుడి భగభగ.. 41 మండలాలకు వడగాలుల హెచ్చరిక..
ఆంధ్రప్రదేశ్‌లో వేసవి తాపం తారాస్థాయికి చేరింది. మార్చి 27న 41 మండలాల్లో, మార్చి 28న 90 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుంది. ఉష్ణోగ్రతలు 42°C వరకు చేరవచ్చు. ప్రజలు ఉదయం 11-సాయంత్రం 4 మధ్య బయటకు వెళ్లవద్దని, గొడుగు లేదా టోపీ ఉపయోగించాలని, వృద్ధులు, పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వేసవి తాపం అప్పుడే పీక్ స్టేజ్‌కు చేరుతోంది. మార్చి నెల ముగియకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి 27 శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత పెరగనుందని, ఈ మేరకు 41 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం.. 9 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తాయి. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, మరియు ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు మండలాలపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో 40 నుండి 42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మార్చి 28 శనివారం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారనుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 90 మండలాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, లేదా టోపీ పెట్టుకొని వెళ్లాలని తెలిపారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర.. ఎంతంటే!
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ‘కోసింది కొయగూర’ సాంగ్
Lokesh Kanagaraj: లోకేష్ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్
‘ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు..’ చేతులు జోడించి మరీ యాంకర్ ఎమోషనల్ !!
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..
చనిపోయిన భార్యపై ప్రేమకు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
ఫేస్బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. కనిపించిన అరుదైన దృశ్యం చూసి
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!
వణికిస్తున్న ప్రాణాంతక ఈగ.. పశువుల మాంసాన్నే తింటూ విస్తరణ
అమెరికా నుంచి భారత్ కు అందుకే వచ్చా!

