AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూట్యూబ్‌ను ఊపేస్తున్న 'కోసింది కొయగూర' సాంగ్

యూట్యూబ్‌ను ఊపేస్తున్న ‘కోసింది కొయగూర’ సాంగ్

Phani CH
|

Updated on: Mar 27, 2026 | 7:46 PM

Share

దిగ్గజ గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలోని 'కోసింది కొయగూర' పాట సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అవుతోంది. ఆనంది నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ జానపద చిత్రంపై పాటలు, గ్లింప్స్ భారీ అంచనాలను పెంచాయి.

దిగ్గజ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెలుగులో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గరివిడి లక్ష్మి పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ అర్జున్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగులో భారీ చిత్రాలను నిర్మించే సంస్థగా పేరున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, గ్లింప్స్ సినిమా అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆ మధ్యన వచ్చిన ‘నల జీలకర్ర మొగ్గ’ పాట ఎంత వైరలైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఈ పాట వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు దీనికి ఏ మాత్రం తగ్గకుండా గరివిడి లక్ష్మి సినిమా నుంచే మరో కొత్త పాట ‘కోసింది కొయగూర’ వచ్చేసింది. అది కూడా అందర్నీ ఆకట్టుకుంటూ విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ‘కోసింది కొయగూర’ సాంగ్‌లో హీరోయిన్ ఆనంది డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ . సినిమాల్లో ఎక్కువగా సైలెంట్ రోల్స్ లో కనిపించే ఈ అమ్మడు ఇప్పుడీ సాంగ్ లో అదరగొట్టింది. చక్కగా చీరకట్టులో ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేసింది. హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా స్టెప్పులేసింది. ఈ పాటను చూసిన వారంతా ఆనంది డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. ఆనందిలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? అని క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఆనందితో పాటు మరో నటుడు రాగ్ మయూర్ ప్రజెన్స్, డ్యాన్స్ మూమెంట్స్ ఈ ఫోక్ సాంగ్ కు మరింత జోష్ ను అందించాయి. ‘కోసింది కొయగూర’ జానపదం సాంగ్ ను చరణ్ అర్జున్ కంపోజ్ చేశారు. అలాగే అనన్య భట్, షకలక శంకర్, గౌరీ నాయుడు జమ్ము వోకల్స్ ఈ పాటకు మరింత వైబ్ ను తీసుకొచ్చాయి. ఈ పాటకు గౌరు నాయుడు, గౌరీ నాయుడు జమ్ము అందించిన సాహిత్యం అదనపు ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇక గరివిడి లక్ష్మి సినిమా విషయానికి వస్తే.. తన పాటలతో కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని ఈ సినిమా రీక్రియేట్ చేస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఒదిగిపోయిందని మేకర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమెతో పాటు ఈ సినిమాలో నరేష్, రాశి, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని తదితరులు వివిధ పాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Lokesh Kanagaraj: లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్

‘ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు..’ చేతులు జోడించి మరీ యాంకర్ ఎమోషనల్ !!

ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా

సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ

పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని నమ్మబలికి.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి

Follow Us