కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించింది. పెట్రోల్‌పై లీటర్‌కు మూడు రూపాయలు, డీజిల్‌పై పూర్తిగా ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. అయితే, ప్రపంచ ముడిచమురు సరఫరాలో ఇబ్బందులు, ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో, తగ్గించిన సుంకాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. వినియోగదారులకు తక్షణ ఉపశమనం లభిస్తుందా అనేది ప్రశ్నార్థకం.