అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న నెక్స్ట్ సంక్రాంతి మల్టీస్టారర్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఖరారయ్యారు. అయితే, ఈ చిత్రంలో కథానాయికల ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. సమాచారం ప్రకారం, కీర్తి సురేష్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరో కథానాయికగా కృతి శెట్టి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ విషయంలో తుది నిర్ణయం కోసం ఎదురుచూడాలి.