విజయవాడ దుర్గగుడిలో ఇద్దరు అర్చకులపై వేటు పడింది. మార్చి 25న మూడో షిఫ్ట్‌లో విధులకు గైర్హాజరైన ఉపప్రధాన అర్చకుడు శ్రీనివాస శర్మ, పరిచారకుడు నాగరాజులపై ఈవో చర్యలు తీసుకున్నారు. ఆకస్మిక తనిఖీలో నిర్లక్ష్యం బయటపడటంతో వారిని సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈవో హెచ్చరించారు.