పాలకూర చికెన్ కర్రీ.. ఒకసారి చేసి తింటే జీవితంలో మళ్లీ వదలరు

Prasanna Yadla

28 March 2026

Pic credit - Pixabay

పాలకూర చికెన్ ఇలా వండితే నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. 

పాలకూర చికెన్

ఇంకెందుకు లేట్, ఈ రెసిపీని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

ఎలా చేయాలంటే

 అర కిలో చికెన్, రెండు కట్టలు  పాలకూర, మూడు టేబుల్ స్పూన్స్ నూనె , రెండు టేబుల్ స్పూన్స్  నెయ్యి, 6 వెల్లుల్లి రెబ్బలు, యాలకులు తీసుకోవాలి.

కావాల్సిన పదార్దాలు

ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, నాలుగు పచ్చిమిర్చి, రెండు ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పును తీసుకోవాలి.

కావాల్సిన పదార్దాలు

ముందుగా చికెన్ తీసుకుని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. 

స్టెప్ - 1

ఒక పాత్రలో నీళ్లు బాగా మరిగించి పాలకూరను బాగా ఉడికించాలి. ఆ తర్వాత వాటిని మెత్తగా అయ్యేలా రుబ్బుకోవాలి. గ్యాస్ స్టవ్ వెలిగించి పాన్‌లో ఆయిల్ లేదా నెయ్యి  చేసి దానిలో అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి.

స్టెప్ - 2

సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అలాగే, టమాటాలు, కొద్దిగా కారం, పసుపు, ఉప్పు వేయాలి. 

స్టెప్ - 3

చివర్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పాలకూర పేస్ట్‌, మసాలాలు కూడా వేసి చికెన్‌లో వేసి మిక్స్ అయ్యేలా కలుపుకుని  కిందకు దించుకోవడమే. 

స్టెప్ - 4