AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: మొదటి 2 వారాలు ఐపీఎల్ మ్యాచ్‌లకు ధోని దూరం.. అధికారిక ప్రకటన

అభిమానులకు నిరాశ కలిగించే వార్తతో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమైంది. చెన్నై జట్టు స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది. చెన్నై జట్టు శనివారం (మార్చి 28) ఉదయం విడుదల చేసిన ప్రకటనలో ధోనీ గాయానికి గురైనట్లు తెలిపింది.

MS Dhoni: మొదటి 2 వారాలు ఐపీఎల్ మ్యాచ్‌లకు ధోని దూరం..  అధికారిక ప్రకటన
ఐపీఎల్ కోసం అద్భుతంగా సిద్ధమైన ధోనీ, తొలి మ్యాచ్ నుంచే ఆడాలని ఉత్సాహంగా ఉన్నాడు. కానీ, ప్రాక్టీస్ సమయంలో గాయపడిన ధోనీ ఇంకా జట్టులో చేరలేదు. ప్రస్తుతం పునరావాసంలో కోలుకుంటున్న ధోనీ, ఐపీఎల్ తొలి రెండు వారాల పాటు అందుబాటులో ఉండడని ఫ్రాంచైజీ ప్రకటించింది. ఇప్పుడు, అతని ఫిట్‌నెస్‌కు సంబంధించి ఒక కొత్త సమాచారం వెలువడింది.
Ram Naramaneni
|

Updated on: Mar 28, 2026 | 10:36 AM

Share

అభిమానులకు భారీ షాక్‌తో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమైంది. CSK స్టార్ ప్లేయర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. జట్టు విడుదల చేసిన అధికారిక ప్రకటనతో ఈ వార్త ఒక్కసారిగా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శనివారం (మార్చి 28) ఉదయం చెన్నై యాజమాన్యం వెల్లడించిన వివరాల ప్రకారం ధోనీ గాయానికి గురయ్యాడు. ఈ గాయం కారణంగా కనీసం తొలి రెండు వారాల పాటు మ్యాచులకు దూరంగా ఉండనున్నాడు. దీంతో సీజన్ ఆరంభంలోనే చెన్నై జట్టు పెద్ద పరీక్షను ఎదుర్కొనాల్సి వస్తోంది.

ధోనీ లేకుండా చెన్నై అంటే.. అది ఫుల్ బ్యాటరీ లేకుండా మొబైల్ లాంటిదే అంటున్నారు అభిమానులు. ఎందుకంటే మ్యాచ్ చివరి క్షణాల్లో ఆటను తిప్పేయగల శక్తి, కూల్‌గా నిర్ణయాలు తీసుకునే తీరు, వికెట్ కీపింగ్‌లో చూపించే క్లాస్.. ఇలా ధోని అంటే ఓ ప్యాకేజ్. అలాంటి ప్లేయర్ లేకపోవడం జట్టుకు ఖచ్చితంగా లోటే. అయితే ఇదే టైమ్‌ను అవకాశంగా మార్చుకునేందుకు జట్టులోని యువ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. “ధోనీ లేని గ్యాప్‌ను ఫిల్ చేయగలమా?” అన్నది ఇప్పుడు అందరి దృష్టి. మేనేజ్‌మెంట్ కూడా ఇప్పుడు దానిపైనే ఫోకస్ పెట్టింది. మిస్టర్ కూల్ త్వరగా కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులకు కోరకుంటున్నారు.

Follow Us
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..
భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..
వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..
వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..
టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..
టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..
ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!
ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!
రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో
రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో