ఆ హీరో నాకు చాలా స్పెషల్.. అతడే నాకు మోటీవేషన్.. మృణాల్ ఠాకూర్..
Rajitha Chanti
Pic credit - Instagram
27 March 2026
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిందీ, తెలుగు భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది ఈ అమ్మడు.
దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో సీతామహలక్ష్మి పాత్రలో అద్భుతమైన నటనతో తెలుగు అడియన్స్ హృదయాలు గెలుచుకుంది.
ప్రస్తుతం అడివి శేష్ సరసన డెకాయిట్ చిత్రంలో నటిస్తుంది. ఈ క్రమంలోనే గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
నేను నటించిన హీరోలందరితో ఎలాంటి సమస్యలు రాలేదు. వారితో నటించినప్పుడు ఎలాంటి కష్టం అనిపించలేదు. నేను మంచి హీరోలతో కలిసి నటించే అదృష్టం రావడం హ్యాపీగా ఉందని అన్నారు.
కెరీర్ ఆరంభం నుంచి వండర్‌ఫుల్ హీరోలు ఉండటం చాలా సంతోషంగా ఉంది. హృతిక్, షాహిద్, దుల్కర్ సల్మాన్, నాని , విజయ్ వంటి హీరోలతో నటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది.
నాకు భాష రాని సమయంలో హీరోలందరూ నాకు చాలా సపోర్ట్‌గా నిలిచారు. భవిష్యత్‌లో కూడా నేను మంచి హీరోలతో కలిసి నటించే అవకాశాలు రావాలని కోరుకొంటున్నానని అన్నారు.
సీతారామం సినిమాలో నటించేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది. ఆ సమయంలో రామ్ క్యారెక్టర్‌లో దుల్కర్ సల్మాన్ ఉండటం చాలా సపోర్టుగా ఉండి ఎన్నో విషయాలు నేర్పించారు.
అప్పటికే దుల్కర్ వివిధ భాషల్లో నటించి ఉన్నారు. దాంతో నాకు నటించడం చాలా సులభమైంది. ఆయన నాకు ఇన్సిపిరేషన్, నా ఫస్ట్ కో-స్టార్. నా మెంటర్. నా ఫ్రెండ్ ఫ్రెండ్ అని మృణాల్ చెప్పారు.