Gas Cylinder Tips: ఈ టిప్స్ ఫాలో అయితే నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు వస్తుంది!
Gas Cylinder Tips: మీ గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని పెంచడానికి ఇక్కడ అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలను పాటించినట్లయితే నెల రోజులు వచ్చే మీ సిలిండర్ ఏకంగా 45 రోజుల వరకు వస్తుంది. దీని వల్ల మీ గ్యాస్ ఎంతో ఆదా అవుతుంది. ప్రస్తుతం ఎల్‌పీపీ సంక్షేభం నేపథ్యంలో ఈ టిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి..

Gas Cylinder Tips
Gas Cylinder Tips: మీ వంట గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని సమర్థవంతంగా పెంచడానికి కొన్ని ముఖ్యమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సాధారణ చిట్కాలను అనుసరించడం ద్వారా నెల రోజులు వచ్చే గ్యాస్ 45 రోజులు పాటు ఉపయోగించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Free Gas: గృహ వినియోగదారులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్.. రూ.500 వరకు ఉచిత గ్యాస్.. సెక్యూరిటీ ఫీజు జీరో…!
- మొదట: స్టవ్ వెలిగించినప్పుడు మంట ఎప్పుడూ నీలం రంగులో ఉండాలి. మంట ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే, బర్నర్ రంధ్రాలు పూడుకుపోయాయని అర్థం. దీనివల్ల గ్యాస్ ఎక్కువగా వృథా అవుతుంది. అందుకే బర్నర్లను వెంటనే శుభ్రం చేయాలి.
- రెండవది: వంట చేసేటప్పుడు పాత్రపై మూత పెట్టడం తప్పనిసరి. మూత పెట్టడం వల్ల ఆవిరి బయటకు పోకుండా లోపలే ఉండి, ఆహారం త్వరగా ఉడుకుతుంది. తద్వారా 30% గ్యాస్ ఆదా అవుతుంది.
- మూడవది: స్టవ్ మీద పాత్ర పెట్టేముందు అది పొడిగా ఉందో లేదో చూసుకోండి. తడి పాత్ర పెడితే ఆ నీరు ఆవిరి కావడానికే కొంత గ్యాస్ వృథా అవుతుంది. అందుకే పాత్రను తుడిచి వాడటం మంచిది.
- నాలుగవది: పప్పులు, బియ్యం లేదా శనగలు వంటివి వండే ముందు కనీసం అరగంట సేపు నీటిలో నానబెట్టండి. దీంతో అవి త్వరగా ఉడుకుతాయి. వంట సమయం తగ్గి గ్యాస్ ఆదా అవుతుంది.
- ఐదవది: వీలైనంత వరకు ఎక్కువగా వంటలను ప్రెజర్ కుక్కర్‌లో చేయండి. సాధారణ పాత్రల కంటే కుక్కర్‌లో వంట త్వరగా అవుతుంది, గ్యాస్ వినియోగం తగ్గుతుంది.
- చివరగా పెద్ద బర్నర్‌పై చిన్న గిన్నె పెట్టి వండొద్దు. మంట గిన్నె దాటి బయటికి వస్తే అది గ్యాస్ వృథా అవుతుందని గుర్తుంచుకోవాలి. అందువల్ల మీడియం ఫ్లేమ్‌లో వంట చేయడం అలవాటు చేసుకోండి. ఈ చిట్కాల ద్వారా మీరు గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి: LPG Gas: సంచలన నిర్ణయం.. వీరికి నిలిచిపోనున్న గ్యాస్ బుకింగ్ సేవలు..!
ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ మొదలైందిరా బాబోయ్.. బంగారం, వెండి ధరలు పరుగులే.. పరుగులు!
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Follow Us




