Facebook: ఫేస్‌బుక్‌లో అత్యధిక వ్యూస్ పొందిన పోస్ట్ ఏంటో తెలుసా..! మన ఇండియాదే..
Most Viewed Facebook Post: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ అత్యధిక వ్యూస్ సాధించిన పోస్టుల వివరాలను వెల్లడించింది. అందులో మన
Most Viewed Facebook Post: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ అత్యధిక వ్యూస్ సాధించిన పోస్టుల వివరాలను వెల్లడించింది. అందులో మన భారతీయ గురువుకి సంబంధించిన పోస్ట్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. బీబీసీ నివేదిక ప్రకారం రాజకీయ అంశాలే కాకుండా మీమ్స్, వైరల్ ఛాలెంజెస్, ఆలోచింపజేసే ప్రశ్నలతోనూ ఫేస్‌బుక్ వ్యూస్‌తో ముందుకు వెళుతుందని తేలింది. కాగా భారతదేశానికి చెందిన గౌర్ గోపాల్ దాస్ పెట్టిన పోస్టుకు విశేష ఆదరణ లభించడం విశేషం. ‘‘మీరు మొదట చూసిన పదాలే.. మీ రియాలిటీ’’ అంటూ పెట్టిన ఓ పోస్టుని ఏకంగా 80.6మిలియన్ల మంది చూశారని తేలింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకూ సేకరించిన ఫేస్‌బుక్ డేటాలో ఈ విషయం స్పష్టమైంది.
సంగీతకారుడు ఏస్ గుప్తా పోస్ట్ 61.4 మిలియన్ల వీక్షకులతో తదుపరి స్థానంలో ఉంది. ఫేస్‌బుక్‌లో అత్యధికంగా వీక్షించబడిన పోస్ట్‌లలో ఎక్కువ భాగం ఫోటో లేదా వీడియోను కలిగి ఉన్నట్లు Facebook గుర్తించింది. జాబితాలో నాలుగో స్థానంలో “మీరు ఆకలితో ఉన్నా ఎన్నటికీ తిననిది ఏమిటి” వంటి ప్రశ్నలు ఉన్నాయి. ఫేస్‌బుక్‌లో చాలా కంటెంట్ ఉన్నందున చాలా మంది ప్రజలు చూసే అంశాలు ఈ నివేదికలో వివరించినట్లుగా తెలిపింది. కాగా న్యూస్ డొమైన్‌లు న్యూస్ ఫీడ్ కంటెంట్‌లో 0.3% మాత్రమే ఉన్నాయి. యూట్యూబ్, అమెజాన్, యునిసెఫ్ లింక్‌లు అత్యధికంగా చూసిన మొదటి మూడు సైట్‌లు.