Ramya: ఉన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య కుటుంబానికి వైసీపీ నేతల పరామర్శ.. ఇంటిపట్టా అందజేత
గుంటూరులో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను హోం మంత్రి మేకతోటి సుచరిత,
YSRCP Leaders: గుంటూరులో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను హోం మంత్రి మేకతోటి సుచరిత, వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పరామర్శించి తమ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ.. భవిష్యత్తు లో రమ్య కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రమ్యను పొట్టనబెట్టుకున్న నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకునే ఆపరిచితుల పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. మహిళల భద్రతపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని హోంమంత్రి చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో ఏక్కడ మహిళలపై అఘాయిత్యం జరిగినా సీఎం స్వయంగా స్పందిస్తున్నారని చెప్పిన హోం మంత్రి.. బాధిత కుటుంబాలకు సీఎం గారు మానవతా దృక్పథంతో సత్వర ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. బాధిత కుటుంబానికి మంత్రి ఇంటి పట్టా అందజేశారు. గుంటూరు జిల్లా పరమాయకుంట లోని రమ్య ఇంటికి హోంమంత్రి మేకతోటి సుచరిత, బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ , వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, గుంటూరు ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దలి గిరి తదితరులు ఉన్నారు.
Read also: Minister Jagdish Reddy: కిషన్ రెడ్డిది ప్రజలను మోసం చేసే యాత్ర.. మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు