AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Galaxy Z Fold, Z Flip: శాంసంగ్‌ నుంచి మడతపెట్టే ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్స్‌.. ప్రయోషన్‌ కోసం బాలీవుడ్‌ నటి

Galaxy Z Fold, Z Flip: దేశంలో రోజురోజుకు కొత్త స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. పోటాపోటీగా అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లో విడుదల చేస్తున్నాయి పలు మొబైల్‌ కంపెనీలు..

Galaxy Z Fold, Z Flip: శాంసంగ్‌ నుంచి మడతపెట్టే ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్స్‌.. ప్రయోషన్‌ కోసం బాలీవుడ్‌ నటి
Subhash Goud
|

Updated on: Aug 21, 2021 | 7:47 AM

Share

Galaxy Z Fold, Z Flip: దేశంలో రోజురోజుకు కొత్త స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. పోటాపోటీగా అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లో విడుదల చేస్తున్నాయి పలు మొబైల్‌ కంపెనీలు. అధునాతన ఫీచర్లను జోడిస్తూ కంపెనీలు కొత్త కొత్త ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చినవే ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్స్‌. తాజాగా ఈ హైఎండ్‌ స్మార్ట్‌ ఫోన్‌ భారత మార్కెట్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే భారత్‌ మినహాయించి ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్‌ 11న గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 3, గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 3 మడత (ఫోల్డబుల్‌ ) ఫోన్లతో పాటు గెలాక్సీ బడ్స్‌ 2, గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌లను విడుదల చేయగా.. ఈ ఫోల్డబుల్‌ ఫోన్లను ఇండియాలో ఆగస్ట్‌ 20న బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా బట్‌ చేతులు మీదిగా మార్కెట్‌ లో విడుదల విడుదలైంది.

శాంసంగ్ ఇండియా ట్విట్టర్ ఫేజ్ ఈ ఫోల్డబుల్ ఫోన్లకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకుంది. బాలీవుడ్ నటి ఆలియా భట్‌తో ఇంటరాక్షన్ ద్వారా గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, జెడ్ ఫ్లిప్ 3లను దేశంలో లాంచ్ చేయడాన్ని ప్రస్తావించింది. వీటిని బట్టి చూస్తే ఈ ఫోల్డబుల్ ఫోన్లకు ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రమోషన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర ఎంతంటే..

ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 12 జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజ్‌ రూ. 1,49,999గా ఉండగా, 12 జీబీ ర్యామ్‌ + 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 1,57,999గా ఉంది. 8 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ రూ. 84,999, 8 జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజ్‌ రూ. 88,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికోసం ఆగస్టు 24 నుంచి ప్రీ ఆర్డర్లు తీసుకోనున్నారు. సెప్టెంబర్‌ 10 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.

ఈ ఫోన్‌ ఫీచర్స్‌

ఈ ఫోన్‌ ఫీచర్స్‌.. 7.6 అంగుళాల ప్రైమరీ క్యూఎక్స్‌జీఏ ప్లస్ డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ ఇన్‌ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్‌ సొంతం. ఇక ఫోన్‌ కవర్ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టంపై నడిచే ఈ ఫోన్‌లో మూడు రెయిర్‌ కెమెరాలు అందించారు. వీటిలో ఒక్కో కెమెరా 12 మెగా పిక్సెల్‌ ఉంటుంది. వైర్‌తోపాటు వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ దీని ప్రత్యేకత. ఇక ఫోల్డ్‌ చేసిన స్క్రీన్‌వైపు అండర్‌ డిస్‌ప్లే కెమెరాను కూడా అందించారు. ఇలా మార్కెట్లో రోజురోజుకు విడుదలయ్యే కొత్త ఫోన్లు కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్ది అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తున్నాయి కంపెనీలు. తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్‌ ఉండేలా మొబైల్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి: OLA Electric Cars: ఓలా నుంచి ఎలక్ట్రిక్‌ కార్లు కూడా వచ్చేస్తున్నాయోచ్‌.. అధికారికంగా ప్రకటించిన సీఈఓ. ఎప్పటి నుంచంటే..

Google Pixel 5a 5g: మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసిన గూగుల్‌.. దుమ్ము, నీటిని తట్టుకునే శక్తి ఈ ఫోన్‌ సొంతం.

Follow Us
భారత్-నేపాల్ మధ్య బలపడుతున్న ద్వైపాక్షిక సంబంధాలు!
భారత్-నేపాల్ మధ్య బలపడుతున్న ద్వైపాక్షిక సంబంధాలు!
అల్లరి పిల్లల వెనుక దాగి ఉన్న తెలివితేటలు! ఈ తేదీల్లో పుట్టినవారి
అల్లరి పిల్లల వెనుక దాగి ఉన్న తెలివితేటలు! ఈ తేదీల్లో పుట్టినవారి
కెనడాలో భారత సంతతి యువ జంట కాల్చివేత!
కెనడాలో భారత సంతతి యువ జంట కాల్చివేత!
పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులు.. బిగ్ న్యూస్ ఇదే..
పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులు.. బిగ్ న్యూస్ ఇదే..
నేను సఫర్ కావడం చూసి నా కూతురు ఎఫెక్ట్ అయ్యింది..
నేను సఫర్ కావడం చూసి నా కూతురు ఎఫెక్ట్ అయ్యింది..
ఇందిరమ్మ బీమా పథకంపై ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్.. వీరికి మాత్రమే
ఇందిరమ్మ బీమా పథకంపై ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్.. వీరికి మాత్రమే
రవి ప్రదోష వ్రతం.. శివుడి అనుగ్రహం కోసం ఈ పూజా విధానం పాటించండి!
రవి ప్రదోష వ్రతం.. శివుడి అనుగ్రహం కోసం ఈ పూజా విధానం పాటించండి!
51 ఏళ్ల వయసులో ఒంటరిగా అలనాటి గ్లామర్ హీరోయిన్..
51 ఏళ్ల వయసులో ఒంటరిగా అలనాటి గ్లామర్ హీరోయిన్..
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అంటూ ఆమెను నమ్మించాడు.. చివరకు
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అంటూ ఆమెను నమ్మించాడు.. చివరకు
సినిమా స్టైల్‌లో గోల్డ్ స్మగ్లింగ్.. మాస్టర్ ప్లాన్ బట్టబయలు!
సినిమా స్టైల్‌లో గోల్డ్ స్మగ్లింగ్.. మాస్టర్ ప్లాన్ బట్టబయలు!