- Telugu News Photo Gallery Technology photos Google Launch Pixel 5A 5G Smart Phone Have A Look On Features And Price Details
Google Pixel 5a 5g: మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన గూగుల్.. దుమ్ము, నీటిని తట్టుకునే శక్తి ఈ ఫోన్ సొంతం.
Google Pixel 5a 5g: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా పిక్సెల్ సిరీస్‌లో భాగంగా మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. గూగుల్ 4ఏ 5జీకి కొనసాగింపుగా 5ఏ 5జీని తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర విషయానికొస్తే..
Updated on: Aug 20, 2021 | 4:00 PM

స్మార్ట్ ఫోన్ రంగంలో గూగుల్ దూసుకుపోతోంది. కొత్త కొత్త ఫోన్‌లను విడుదల చేస్తూ స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆట్రాక్ట్ చేస్తోంది.

ఇప్పటికే గూగుల్ 4ఏ 5జీ ఫోన్‌ను లాంచ్ చేసిన గూగుల్ తాజాగా దీనికి కొనసాగింపుగా గూగుల్ 5ఏ 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.

వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ వంటి అధునాతన ఫీచర్లను అందించిన ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే 4ఏతో పోలిస్తే కాస్త పెద్దగా ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ను అమెరికా, జపాన్‌లో విడుదల చేశారు. తర్వలోనే భారత మార్కెట్లోకి రానుంది.

అదిరిపోయే ఫీచర్లతో రూపొదించిన ఈ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్‌లో రూ. 33,400గా ఉండనుంది. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ మీద నడుస్తుంది.

ఈ ఫోన్‌లో 6.34-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే విత్ 60 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. దీంతో పాటు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765జీ ఎస్‌ఓసీ దీని సొంతం.

కెమెరా విషయానికొస్తే 12.2+ 16మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాతో పాటు సెల్ఫీలకోసం 8మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 4,680mAh బ్యాటరీని జోడించారు.




