షాకింగ్‌.. నలుగురు పిల్లల తల్లితో 21 ఏళ్ల యువకుడి పెళ్లి.. రెండేళ్లుగా ప్రేమాయణం.. ఆపై ఇలా..

షాకింగ్‌.. నలుగురు పిల్లల తల్లితో 21 ఏళ్ల యువకుడి పెళ్లి.. రెండేళ్లుగా ప్రేమాయణం.. ఆపై ఇలా..
41 Year Old Woman

Young Man Married to 41Year Old Woman: ప్రేమ ఎప్పుడు, ఎవరిపై, ఎందుకు పుడుతుందో ఎవరికి తెలియదు.. అందుకే ప్రేమ గుడ్డిదంటారు కొంతమంది.

uppula Raju

|

Aug 21, 2021 | 5:51 AM

Young Man Married to 41Year Old Woman: ప్రేమ ఎప్పుడు, ఎవరిపై, ఎందుకు పుడుతుందో ఎవరికి తెలియదు.. అందుకే ప్రేమ గుడ్డిదంటారు కొంతమంది. వినడానికి ఇబ్బందికరంగా ఉన్నా ఇది వాస్తవం అంతేకాదు పచ్చి నిజం. ఎందుకంటే అప్పుడప్పుడు లోకంలో జరిగే కొన్ని సంఘటనలు వీటికి ఆజ్యం పోస్తాయి. ఓ తెలుగు సినిమాలో హీరో ‘నా కళ్లతో చూడు మామా’ అంటూ ఓ ప్రత్యేక డైలాగ్‌ చెబుతాడు సరిగ్గా ఈ డైలాగ్‌ బిహార్‌లో జరిగిన ఓ పెళ్లి సంఘటనకు సెట్ అవుతుంది. ఇక్కడ 21 ఏళ్ల యువకుడు నలుగురు పిల్లలున్న 41 మహిళను ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం. మరి ఈ వింత లవ్‌ స్టోరీకి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

బిహార్‌లోని ఖగడియా జిల్లా దరియాపుర్ పంచాయతీ పరిధి నయాగావ్​కు చెందిన ఓ మహిళకు 41ఏళ్లు. ఆమెకు నలుగురు పిల్లలున్నారు. భర్త కొద్ది కాలం క్రితం మృతిచెందాడు. కాగా జొరావర్​పుర్​కు చెందిన 21 ఏళ్ల రవికుమార్​అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత రెండేళ్లుగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ ఇంటికి రవికుమార్ తరచూ వస్తూ ఉంటాడు. ఇది గమనించిన స్థానికులు ఈ వ్యవహారం ఎదో తేడాగా ఉందే అంటూ అనుమానించారు. చివరకు వారనుకున్నదే నిజం అయింది.

ఓ రోజు రవికుమార్‌ ఇంట్లో ఉండగా గమనించిన స్థానికులు వారిద్దరిని పట్టుకుని అసలు విషయం ఏంటని నిలదీశారు. యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించి రప్పించారు. దరియాపుర్ సర్పంచ్​ శంబుసింగ్, జొరావ్‌పుర్ సర్పంచ్ పంకజ్ షా ఆ మహిళ ఇంటికి చేరుకుని గ్రామస్థులు, కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వారిద్దరికీ వివాహం జరిపించారు. మొత్తం నలుగురు సంతానంలో ఇద్దరు పిల్లలు కొత్త జంట వద్ద.. మరో ఇద్దరిని ఆ మహిళ తల్లి వద్ద ఉంచేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే వీరిద్దరి పెళ్లి ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌టాఫిక్‌గా మారింది. బిహార్ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. విషయం తెలిసిన నెటిజన్లు ఇదే రకం ప్రేమ అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఆ యువకుడు ఆదర్శప్రాయుడంటూ ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుంటే జీవితం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరనేది మాత్రం వాస్తవం.

బుట్టబొమ్మపై ఫైర్‌ అయిన ఎమ్మెల్యే రోజా భర్త.. స్టార్ డమ్‌ రాగానే మారిపోయిందని విమర్శలు..

T20 World Cup: టీ 20 వరల్డ్ కప్‌లో ఆ నాలుగు జట్లు కచ్చితంగా సెమీస్‌కి..! జోస్యం చెబుతున్న టీమిండియా మాజీ ప్లేయర్..

Ramya: ఉన్మాది చేతిలో హత్యకు గురైన ర‌మ్య కుటుంబానికి వైసీపీ నేత‌ల ప‌రామ‌ర్శ.. ఇంటిపట్టా అందజేత

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu