T20 World Cup: టీ 20 వరల్డ్ కప్‌లో ఆ నాలుగు జట్లు కచ్చితంగా సెమీస్‌కి..! జోస్యం చెబుతున్న టీమిండియా మాజీ ప్లేయర్..
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం అన్ని దేశాలు రెడీగా ఉన్నాయి. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు యూఏఈ, ఒమన్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది.
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం అన్ని దేశాలు రెడీగా ఉన్నాయి. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు యూఏఈ, ఒమన్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇప్పటికే వివిధ జట్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పంచ్ హిట్టర్లందరు సమాయత్తమవుతున్నారు. ఈ టోర్నీలో ఏ జట్టు విజయం సాధిస్తుంది. ఏవి సెమీస్‌కి వెళుతాయనే చర్చ అప్పుడే మొదలైంది. మాజీ క్రికెటర్లందరు తమ అనుభవాన్ని రంగరించి జోస్యం చెబుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ టీ 20 వరల్డ్ కప్‌లో ఆ నాలుగు జట్లు సెమీస్‌కి వెళుతాయని తన మనసులోని మాటలను బయటపెట్టాడు.
ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వూలో గౌతమ్ గంభీర్ ఈ మెగా టోర్నీ గురించి మాట్లాడారు. ‘ఈ టీ20 ప్రపంచకప్‌లో ఏయే జట్లు సెమీస్ చేరుతాయని అంచనా వేస్తున్నారు’ అని అడిగిన ప్రశ్నకు ‘‘భారత్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు సెమీస్ చేరుతాయని భావిస్తున్నా’’ అని సమాధానమిచ్చాడు. ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్‌ని టీమ్‌ఇండియా ఒక్కసారి మాత్రమే ముద్దాడింది. 2007 ఆరంభ ఎడిషన్‌లో ధోనీ సారథ్యంలో పాకిస్తాన్‌పై 5 పరుగుల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది.
ఇదిలా ఉంటే ఈసారి ఆస్ట్రేలియా విజేతగా నిలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇటీవల జోస్యం చెప్పగా.. గంభీర్ అంచనా వేసిన జట్లలో ఆస్ట్రేలియా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వెస్టిండీస్ రెండుసార్లు(2012, 2016) విజేతగా నిలవగా.. 2010లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లాండ్ ఛాంపియన్‌గా అవతరించింది. న్యూజిలాండ్ ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌ని సాధించలేదు. అయితే ఈసారి ఏ జట్టు గెలుస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.