ధావన్, గంభీర్ వంటి హేమాహేమీలతో ఆడిన ఆ క్రికెటర్ ఆటకు వీడ్కోలు పలికాడు.. ఆ ఢిల్లీ స్టార్ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.
ఏ ఆటలోనైనా పదవీ విరమణ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇది క్రికెట్‌లోనూ సాధారణమైన విషయమే. అయితే ఇంటర్నేషనల్ టోర్నీల్లో ఆడి విమరణ ప్రకటించిన వారి పేర్లే ఎక్కువగా..
ఏ ఆటలోనైనా పదవీ విరమణ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇది క్రికెట్‌లోనూ సాధారణమైన విషయమే. అయితే ఇంటర్నేషనల్ టోర్నీల్లో ఆడి విమరణ ప్రకటించిన వారి పేర్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి. అలా కాకుండా అండర్ 19లోనూ అద్భుత ఆటతీరును కనబరిచి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగకుండా ఎంతో మంది క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంఘటనలు చరిత్రలో ఉన్నాయి. ఇటీవల ఉన్ముక్త్ చంద్ అనే క్రికెటర్ ఇండియా అండర్ – 19 ప్రపంచకప్ గెలిచిన తర్వాత క్రికెట్ నుంచి రిటైర్మైంట్ ప్రకటించాడు. అయితే ఉన్ముక్త్ విరమణ ప్రకటించిన కేవలం ఆరు రోజులకే మరో స్టార్ క్రికెటర్ భారత్‌లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అతనే ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మనన్ శర్మ.
శిఖర్ ధావన్, గౌతమ్ గంభీర్, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్ వంటి స్టార్ ప్లేయర్స్‌తో ఆడిన మనన్ శర్మ.. 2010లో న్యూజిలాండ్‌లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లోనూ పాల్గొన్నాడు. ఆ సమయంలో ఈ టీమ్‌లో కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, సందీప్ శర్మ, జయదేవ్ ఉనద్కట్ వంటి మేటి ఆటగాళ్లు ఉన్నారు. ఇదిలా ఉంటే అండర్ 19లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన మనన్ శర్మ తన 30వ ఏట క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మనన్ అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళుతున్నాడు. ఇక మనన్ శర్మ ఇప్పటి వరకు తన కెరీర్‌లో 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అమెరికా వెళ్లిన తర్వాత అక్కడ క్రికెట్ ఆడతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే మనన్ శర్మ తండ్రి అజయ్ కూడా క్రికెటర్ కావడం విశేషం. అజయ్ ఇండియా జట్టు తరఫున టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.
Manan Sharma, Delhi and India under-19 cricketer, has announced his retirement from all forms of game. Manan, 30, played 35 First Class matches. He will now move to California. His father Ajay played Test cricket for India. pic.twitter.com/SdYbr0enBI
— Vijay Lokapally (@vijaylokapally) August 19, 2021
మనన్ కెరీర్ సాగిందిలా..
లెఫ్ట్ ఆర్మ్ స్పి్‌న్ బౌలర్, బ్యాట్స్‌మెన్ అండర్ 19 జట్టులో ఆల్ రౌండర్ ప్రతిభను ప్రదర్శించాడు. మొత్తం 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో, మనన్ ఒక సెంచరీ, ఎనిమిది అర్ధ సెంచరీలతో మొత్తం 1208 పరుగులు చేశాడు. అంతేకాకుండా బౌలింగ్‌లో కూడా రాణిస్తూ 113 వికెట్లు తీశాడు. మనన్ శర్మ చివరిగా 2019 అక్టోబర్‌లో లిస్ట్ ఎ క్రికెట్‌లో ఢిల్లీ తరఫున ఆడాడు. ఇదిలా ఉంటే మనన్ శర్మ ఐపిఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
Also Read: Palamuru Ladies: పాలమూరు మహిళా సమాఖ్యల గిన్నీస్ రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్
Viral Video: నో పార్కింగ్ జోన్ లో బైక్ ఉందని పోలీసులు ఏం చేశారో చూస్తే షాకే!