ఈ టీమిండియా ఓపెనర్‌ డకౌట్‌ అయినా మ్యాచ్‌ హీరోగా మారాడు..! ఎలాగో తెలుసా..

Cricket News: భారత క్రికెట్ జట్టుకి చెందిన ఈ మాజీ ప్లేయర్‌ చరిత్ర మామూలుది కాదు. ఇతడు ప్రపంచంలోని ప్రతి మైదానంలో తన బ్యాట్‌తో బలమైన ముద్ర వేశాడు.

ఈ టీమిండియా ఓపెనర్‌ డకౌట్‌ అయినా మ్యాచ్‌ హీరోగా మారాడు..! ఎలాగో తెలుసా..
Sunil Gavaskar
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Aug 21, 2021 | 6:43 AM

Cricket News: భారత క్రికెట్ జట్టుకి చెందిన ఈ మాజీ ప్లేయర్‌ చరిత్ర మామూలుది కాదు. ఇతడు ప్రపంచంలోని ప్రతి మైదానంలో తన బ్యాట్‌తో బలమైన ముద్ర వేశాడు. గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. అందులో ఈ మ్యాచ్‌ ఒకటి. మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ వర్సెస్‌ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్‌. వేదిక లార్డ్స్‌ మైదానం. మ్యాచ్ 20 ఆగస్టు 1987 నుంచి ఆగస్టు 25 వరకు జరిగింది. ఇందులో మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 455 పరుగులకు డిక్లేర్ చేసింది. కెప్టెన్ మైక్ గాటింగ్ 179 పరుగులు చేయగా, గ్రాహం గూచ్ 117 పరుగులు చేశాడు. రెండు సెంచరీలతో పాటు రెండు అర్ధ సెంచరీలు కూడా నమోదయ్యాయి. గోర్డాన్ గ్రీనిడ్జ్ 52 పరుగులు, క్లైవ్ రైస్ 59 పరుగులు చేశారు.

ప్రత్యుత్తరంగా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొదటి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 421 పరుగులకు డిక్లేర్ చేసింది. ఓపెనర్ సునీల్ గవాస్కర్ 188 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అందరి ప్రశంసలు అందుకున్నాడు. 351 బంతులను ఎదుర్కొన్న అతను 23 ఫోర్లు కొట్టాడు. గవాస్కర్ కాకుండా ఇమ్రాన్ ఖాన్ 82 పరుగులు చేశాడు. MCC బౌలర్లు రవిశాస్త్రి, మాల్కం మార్షల్ మూడు వికెట్లతో రాణించారు. తర్వాత MCC జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈసారి జట్టు 6 వికెట్ల నష్టానికి 318 పరుగులకు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

గోర్డాన్ గ్రీనిడ్జ్ సెంచరీ సాధించాడు. 122 పరుగులు చేశాడు. అతనితో పాటు గ్రాహం గూచ్ 70, డేవిడ్ గోవర్ 40, రిచర్డ్ హాడ్లీ 36 పరుగులు సాధించారు. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి అబ్దుల్ ఖాదిర్ రెండు వికెట్లు పడగొట్టగా, ఇమ్రాన్ ఖాన్, కోర్ట్నీ వాల్ష్, కపిల్ దేవ్, రోజర్ హార్పర్ తలా ఒక వికెట్ సాధించారు. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ విజయానికి 353 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జట్టు 1 వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది అప్పుడే మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించాల్సి వచ్చింది. ఈ ఇన్నింగ్స్‌లో సునీల్ గవాస్కర్ 3 బంతులు ఎదుర్కొని డకౌట్‌ అయ్యాడు. అయినప్పటికీ అతను మ్యాచ్‌ హీరో అయ్యాడు.

Facebook: ఫేస్‌బుక్‌లో అత్యధిక వ్యూస్‌ పొందిన పోస్ట్‌ ఏంటో తెలుసా..! మన ఇండియాదే..

షాకింగ్‌.. నలుగురు పిల్లల తల్లితో 21 ఏళ్ల యువకుడి పెళ్లి.. రెండేళ్లుగా ప్రేమాయణం.. ఆపై ఇలా..

బుట్టబొమ్మపై ఫైర్‌ అయిన ఎమ్మెల్యే రోజా భర్త.. స్టార్ డమ్‌ రాగానే మారిపోయిందని విమర్శలు..