Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: గర్భధారణ సమయంలో మధుమేహం ఉన్నవారి పిల్లలకు దృష్టి లోపాలు వచ్చే అవకాశం ఎక్కువ!

మధుమేహం ఉన్న తల్లుల పిల్లలు భవిష్యత్తులో 39% ఎక్కువ దృష్టి కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. అలాంటి పిల్లల కళ్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అవసరం అని వారు సూచిస్తున్నారు. 

Diabetes: గర్భధారణ సమయంలో మధుమేహం ఉన్నవారి పిల్లలకు దృష్టి లోపాలు వచ్చే అవకాశం ఎక్కువ!
Refractive Errors
Follow us
KVD Varma

|

Updated on: Aug 20, 2021 | 10:18 PM

Diabetes: మధుమేహం ఉన్న తల్లుల పిల్లలు భవిష్యత్తులో 39% ఎక్కువ దృష్టి కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. అలాంటి పిల్లల కళ్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అవసరం అని వారు సూచిస్తున్నారు.  అంతర్జాతీయ పరిశోధకులు తమ ఇటీవలి పరిశోధనలో ఈ విషయాన్ని తెలుసుకున్నారు.  పరిశోధకులు, గర్భిణీ స్త్రీలో మధుమేహం ప్రభావం భవిష్యత్తులో పిల్లలలో కనిపిస్తుందాని అంటున్నారు. తల్లిలో మధుమేహం వల్ల పిల్లల్లో ప్రమాదం ఎలా పెరుగుతుంది, పిల్లలలో ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకుందాం.

అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం డెన్మార్క్ లోని  553 మంది పిల్లలపై ఈ  అధ్యయనం చేసింది. గర్భధారణకు ముందు తల్లులకు టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారి పిల్లలు వీరందరూ. వీరిలో కొందరు గర్భధారణ సమయంలో మధుమేహం వ్యాధికి గురైనవారు. ఈ రకమైన మధుమేహాన్ని శాస్త్రీయంగా గర్భధారణ మధుమేహం అంటారు.

ఈ పరిశోధన పూర్తయిన తర్వాత, ఈ 553 మంది పిల్లలను గర్భధారణ సమయంలో తల్లులకు మధుమేహం లేని 20 వేల మంది పిల్లలతో పోల్చారు. పరిశోధకులు ఈ 553 మంది పిల్లలను తదుపరి 25 సంవత్సరాల పాటు పర్యవేక్షించారు.

మరిన్ని చిక్కులు, ఎక్కువ ప్రమాదం..

నాన్జింగ్ మెడికల్ యూనివర్శిటీ ఆఫ్ చైనా ప్రొఫెసర్, పరిశోధనా బృందం అధిపతి డా. జియాంగ్బో డు డయాబెటిక్ తల్లుల పిల్లలు 39 శాతం ఎక్కువ వక్రీభవన లోపం కలిగి ఉంటారని చెప్పారు. ఇది జరిగినప్పుడు, కళ్ళు వస్తువులపై దృష్టిని కేంద్రీకరించలేవు, ఫలితంగా పిల్లవాడు విషయాలను స్పష్టంగా చూడలేడు. డాక్టర్ జియాంగ్బో మాట్లాడుతూ, తల్లులలో డయాబెటిస్‌తో ముడిపడి ఉన్న సమస్యలు, పిల్లలలో కంటి చూపు మందగించే ప్రమాదం కూడా పెరుగుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికంటే, టైప్ 1 డయాబెటిస్ ఉన్న తల్లుల పిల్లలలో ప్రమాదం కొద్దిగా తక్కువగా ఉంటుంది.

ఈ ప్రమాదాలను నివారించడానికి, మహిళలు రెండు విషయాలపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. డయాబెటాలజీ పత్రికలో ప్రచురితమైన ఒక పరిశోధనలో ఇలా చెబుతున్నారు..”ముందుగా, గర్భధారణకు ముందు — గర్భధారణ సమయంలో మీ రక్తంలో చక్కెరను తనిఖీ చేయండి. నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఏదైనా చర్య తీసుకోండి. రెండవది, మీరు చిన్న వయస్సు నుండే మీ పిల్లల కళ్లను పరీక్షించుకోవాలి. ప్రమాదాన్ని తగ్గించడానికి, కళ్ళను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోండి.”

డయాబెటిక్ తల్లుల పిల్లలలో కంటి సమస్యలకు కచ్చితమైన రుజువులు లభించినందు వలన ఈ పరిశోధన ముఖ్యమని యూకేలోని రీసెర్చ్ కమ్యూనికేషన్స్ హెడ్ డాక్టర్ లూసీ చాంబర్స్ చెప్పారు. గర్భధారణ, రోగ్యకరమైన శిశువుకు సంబంధించిన సమస్యలను తొలగించడానికి నిపుణుల సలహాతో రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read: ఆందోళనలో డాక్టర్స్.. కరోనా ట్రీట్మెంట్‌ లో కన్‌ఫ్యూజన్.. బయటపడుతున్న కొత్త లక్షణాలు..:Corona Third Wave Video.

Gadgets Impact on Children: మీ చిన్నారులు మొబైల్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నారా? జాగ్రత్త..వారికి ఈ ప్రమాదం పొంచివుంది!

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏకమవుతున్న ఠాక్రే బ్రదర్స్‌
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏకమవుతున్న ఠాక్రే బ్రదర్స్‌
JEE మెయిన్‌లో 24 మందికి 100 పర్సంటైల్‌.. టాప్‌ ర్యాంకర్లు వీరే..!
JEE మెయిన్‌లో 24 మందికి 100 పర్సంటైల్‌.. టాప్‌ ర్యాంకర్లు వీరే..!
14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం.. తొలి బంతికే సిక్స్‌తో కొత్త చరిత్ర
14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం.. తొలి బంతికే సిక్స్‌తో కొత్త చరిత్ర
ఈ పరుగు మనకోసం..! ఓరల్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 5కె, 10కె రన్..
ఈ పరుగు మనకోసం..! ఓరల్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 5కె, 10కె రన్..
Video: ఇదేం బౌలింగ్ భయ్యా.. అర్థమయ్యేలోపే క్లీన్ బౌల్ట్
Video: ఇదేం బౌలింగ్ భయ్యా.. అర్థమయ్యేలోపే క్లీన్ బౌల్ట్
ఏసీని నాన్ స్టాప్ వాడేస్తున్నారా.. రాత్రిపూట ఈ జాగ్రత్తలు మస్ట్
ఏసీని నాన్ స్టాప్ వాడేస్తున్నారా.. రాత్రిపూట ఈ జాగ్రత్తలు మస్ట్
నీట్‌ పీజీ 2025 నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. పరీక్ష తేదీ ఇదే
నీట్‌ పీజీ 2025 నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. పరీక్ష తేదీ ఇదే
ఎవర్రా నువ్వు.. టీ20ల్లో చెత్త బ్యాటింగ్.. 20 ఓవర్లలో 33 పరుగులు
ఎవర్రా నువ్వు.. టీ20ల్లో చెత్త బ్యాటింగ్.. 20 ఓవర్లలో 33 పరుగులు
EAPCET 2025 పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
EAPCET 2025 పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
భవనం కూలిన ఘటనలో 11 మంది మృతి.. పాపం అంతా నిద్రలోనే..
భవనం కూలిన ఘటనలో 11 మంది మృతి.. పాపం అంతా నిద్రలోనే..