Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delta Cases: వ్యాక్సిన్‌ వేసుకున్నా వదలని డెల్టా..! బ్రిటన్, అమెరికాలో అతాలాకుతలం..

Delta Variant: కరోనా మహమ్మారి కారంగా ఇప్పటికే ప్రపంచమంతా అతలాకుతలమవుతోంది. తాజాగా కొత్త రకం వేరియంట్‌ డెల్టా ప్లస్‌ మరింత విజృంభిస్తోంది.

Delta Cases: వ్యాక్సిన్‌ వేసుకున్నా వదలని డెల్టా..! బ్రిటన్, అమెరికాలో అతాలాకుతలం..
Delta Plus Variant
Follow us
uppula Raju

|

Updated on: Aug 21, 2021 | 6:00 AM

Delta Variant: కరోనా మహమ్మారి కారంగా ఇప్పటికే ప్రపంచమంతా అతలాకుతలమవుతోంది. తాజాగా కొత్త రకం వేరియంట్‌ డెల్టా ప్లస్‌ మరింత విజృంభిస్తోంది. వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ భారత్‌లో డెల్టా కేసులు అధిక మొత్తంలో వెలుగు చూస్తున్నాయని కరోనా వైరస్‌ జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సోర్టియం ఐఎన్‌ఎస్‌ఏసీఏజీ తెలిపింది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేయడం లేదని ఆరోపిస్తుంది. డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే ఈ వేరియంట్‌ను ఆందోళనకరంగా పేర్కొంది.

అయితే వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో వ్యాధి తీవ్రత అంతగా కనిపించడం లేదని, మరణాలు దాదాపుగా లేవని ఐఎన్‌ఎస్‌ఏసీఏజీ వెల్లడించింది. దేశంలో మొత్తంగా 30,230 శాంపిల్స్‌ని పరీక్షించి చూస్తే వాటిలో 20.324 డెల్టా కేసులేనని తెలిపింది. ఇప్పటికే ఈ రకం వేరియంట్‌ 11 దేశాలకు వ్యాపించింది. అమెరికా, భారత్‌తో పాటు బ్రిటన్‌, పోర్చుగల్‌లో ఈ కేసులు సంఖ్య అధికంగా ఉంది. చాలా దేశాల్లో కరోనా వైరస్‌ మరోసారి విజృంభణకు ఈ వేరియం దోహదం కానుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. వ్యాక్సిన్‌తో పాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తోంది.

భారత్‌లో మొదటి సారిగా వెలుగు చూసిన డెల్టా వేరియెంట్‌ బ్రిటన్, అమెరికాలను అతలాకుతలం చేస్తోంది. మన దేశంలోనూ సెకండ్‌ వేవ్‌ ప్రబలంగా ఉండడానికి డెల్టా వేరియెంటే కారణం. దేశంలో ఆర్‌ వాల్యూ 0.89కి తగ్గినప్పటికీ ప్రతీ రోజూ 30 వేలకు పైగా కేసులు నమోదు కావడానికి డెల్టా వేరియెంటే కారణమని ఐఎన్‌ఎస్‌ఏసీఏజీ అంచనా వేస్తుంది. డెల్టా రకాన్ని ఎదుర్కొవడంలో వ్యాక్సిన్‌ ఒక్కటే సరిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ రష్యా ప్రతినిధి మోలీటా వునోవిక్‌ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ +మాస్కులను తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌ వల్ల వైరస్‌ వ్యాప్తిని కొంత వరకు తగ్గించడంతో పాటు తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ ప్రభావం నుంచి బయటపడవచ్చని అన్నారు. అయినా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు. తొందరగా చర్యలు చేపట్టకపోతే మరోసారి లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.

T20 World Cup: టీ 20 వరల్డ్ కప్‌లో ఆ నాలుగు జట్లు కచ్చితంగా సెమీస్‌కి..! జోస్యం చెబుతున్న టీమిండియా మాజీ ప్లేయర్..

బుట్టబొమ్మపై ఫైర్‌ అయిన ఎమ్మెల్యే రోజా భర్త.. స్టార్ డమ్‌ రాగానే మారిపోయిందని విమర్శలు..

షాకింగ్‌.. నలుగురు పిల్లల తల్లితో 21 ఏళ్ల యువకుడి పెళ్లి.. రెండేళ్లుగా ప్రేమాయణం.. ఆపై ఇలా..